జ‌గ్గంపేట సాక్షిగా బాబు బ‌య‌ప‌డె విధంగా జ‌గ‌న్ కాపుల‌కు సంచ‌ల‌న‌ హామీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-07-28 06:18:20

జ‌గ్గంపేట సాక్షిగా బాబు బ‌య‌ప‌డె విధంగా జ‌గ‌న్ కాపుల‌కు సంచ‌ల‌న‌ హామీ

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన‌  ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ప్ర‌జలు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర తెలుగు దేశం పార్టీ నాయ‌కుల కంచుకోట అయిన తూర్పుగోదావ‌రి జిల్లా జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ సంకల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే నవ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.
 
ఇక తాజాగా జ‌గ్గంపేట‌లో వైసీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌లు ఏర్పాటు చేసిన భారీ భ‌హిరంగ స‌భ‌లో పాల్గొని మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు జ‌గ‌న్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, 2014లో అధికార‌మే అక్ష్యంగా చేసుకుని చంద్ర‌బాబు నాయుడు సుమారు ఆరువంద‌ల‌కు పైగా హామీల‌ను ప్ర‌క‌టించార‌ని అయితే ఆయ‌న‌ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నార‌ని కానీ ఇంత వ‌రకూ ఒక్క హామీను కూడా అమ‌లు చెయ్య‌లేద‌ని జ‌గ‌న్ ఆరోపించారు. 
 
అంతేకాదు గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడు కాపుల‌ను బీసీల్లో చేర్చుతాన‌ని, అలాగే బీసీల‌ను ఎస్టీల్లో చేర్చుతాన‌ని చెప్పి ఇంత‌వ‌ర‌కు వారిని చేర్చ‌లేద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. అయితే తాను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లాగా ఎన్నిక‌ల ముందు నాలుగు నెల‌ల‌కోసం త‌ప్పుడు హామీల‌ను ప్ర‌క‌టించ‌న‌ని వైసీపీ అధికారంలోకి వ‌స్తే... ప్ర‌స్తుతం టీడీపీ నాయ‌కులు కాపు సంఘాల‌కు ఎంత‌మేర‌కు నిధులు కేటాయించారో దానికి రెట్టింపు తాను కేటాయిస్తాన‌ని జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ ఇచ్చారు. దీంతో కాపులు త‌మ‌కు 2019లో న్యాయం ఖ‌చ్చితంగా జ‌రుగుతుంద‌ని సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.