జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-28 15:05:44

జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌లు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి చుక్కులు చూపిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో జగన్ చేస్తున్న సంచలన ప్రకటనల‌తో టీడీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు...జగన్ అన్ని వర్గాల వారికీ హామీలు ఇస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు...
 
పార్టీ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలతో పాటు అనేక హామీలను పాదయాత్రలో ప్రకటిస్తున్నారు... బడుగు,బ‌ల‌హీన వ‌ర్గాల‌కు 45 ఏళ్ల‌కే పెన్ష‌న్, రైతులకు ఏడాదికి పంటలు వేసుకోవడానికి 12 వేల‌ రూపాయలు, రైతులకు గిట్టుబాటు ధర, ఆటో కార్మికులకు నెలకు 10 వేల రూపాయలు, బ్రాహ్మణులకు కార్పొరేషన్, 2 వేల రూపాయ‌ల పెన్ష‌న్, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామ రాజు, ఇలా అన్ని వర్గాల వారికీ ఎన్నో హామీలను ప్రకటించి సంచలనం సృష్టించారు.
 
ప్ర‌జ‌ల‌కు అన్న వ‌స్తున్నాడ‌ని చెప్పండంటూ పార్టీ శ్రేణుల‌కు ఆయ‌న పిలుపినిచ్చారు. దీంతో ఒక్కసారిగా జ‌గ‌న్ ప్ర‌క‌ట‌నలు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఏది ఏమైనా జ‌గ‌న్ మాత్రం చంద్ర‌బాబును అధికారం నుండి గ‌ద్దె దించేందుకు త‌న దైన శైలిలో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే జ‌గ‌న్ ఇస్తున్న హామీలు అమలు చేయ‌డం సాధ్యం కాదు అంటూ ప్రచారం చేస్తున్నారు టీడీపీ నాయకులు.
 
అయితే టీడీపీ నేత‌ల మాదిరిగా తాము అధికారంలోకి వ‌చ్చాక అవినీతికి పాల్ప‌డ‌బోమ‌ని...ప్రతి రూపాయి ప్రజలకు చేరేలా చేసి, ఇచ్చిన హామీలను పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి తప్పక నెరవేరుస్తారని, ఇచ్చిన మాట కోసం ఎంతవరకైనా జగన్ మోహన్ రెడ్డి వెళ్తారని అంటున్నారు వైసీపీ నాయకులు...రాజ‌న్న పాల‌న‌ను తిరిగి ప్ర‌జ‌ల‌కు అందించే దిశ‌గా ప‌రిపాల‌న సాగిస్తాము కావున‌, మేము ఇచ్చిన హామీల‌ను తూ.చ త‌ప్ప‌కుండా అమ‌లు చేసి చూపిస్తామ‌ని ఆ పార్టీ నేత‌లు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.