బ్రేకింగ్.. నిన్ను న‌మ్మం బాబు ప‌థం స్టార్ చేసిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-28 15:44:21

బ్రేకింగ్.. నిన్ను న‌మ్మం బాబు ప‌థం స్టార్ చేసిన జ‌గ‌న్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ ఎండ, గాలీ, వాన‌ను లెక్క చెయ్య‌కుండా పాద‌యాత్ర చేస్తున్నారు. ఇక మ‌రో వైపు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మ‌రోసారి అధికారంలో రావాలనే ఉద్దేశంతో స‌రికొత్త వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. ఇక వారు చేస్తున్న వ్యూహాలకు వైసీపీ నాయ‌కులు అడుగ‌డుగునా చెక్ పెట్టేందుకు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ సైన్యాలు రెడీ అవుతున్నాయి.
 
ఇందుకోసం వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేల‌తో, ఇంచార్జ్ ల‌తో అలాగే పార్ల‌మెంట్ స‌భ్యుల‌తో కీల‌క స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలో పార్టీ స్థితిగ‌తుల గురించి చ‌ర్చించిన త‌ర్వాత మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకో నున్నరార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆగ‌స్ట్ 2 నుంచి నుంచి వైసీపీ నాయ‌కులు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ సైన్యంలా మారి ప్ర‌తీ గ్రామానికి తిరుగ‌నున్నారు.
 
తొలుత మూడు ద‌శ‌ల‌వారిగా మార్చి ఒక్కోద‌శ ఒక‌నెల‌పాటు చేపట్ట‌నున్నారు. మొత్తం మూడు నెలల పాటు పార్టీ నేతలు  ప్ర‌తీ వీధి వీధినా తిరిగి జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌రత్నాల‌ను ప్రజ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. ఆగస్ట్ 2 నుంచి అక్టోబర్ 16వ తేది వ‌ర‌కు చేప‌ట్ట‌నున్న ఈ యాత్ర‌కు ‘నిన్ను నమ్మం బాబు’ పేరును కూడా పెట్టిన‌ట్టు తెలుస్తోంది. 
 
ఈ పేరు పార్టీ అధిష్టానం ఎందుకు ప్ర‌క‌టించారు అంటే అధికారంలోకి వ‌చ్చిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా రైల్వేజోన్, క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ సాధ‌న‌లో యూట‌ర్న్ విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ నిన్ను నమ్మం బాబు అనే పేరుని పెట్టిన‌ట్టు తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.