జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-04 12:59:15

జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

నిన్న క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ సాధ‌న కోసం విద్యార్థి సంఘాల నాయ‌కులు క‌లెక్ట‌ర్ ముట్ట‌డి కార్య‌క్ర‌మం చేస్తే వారిపై పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో కొంత‌మంది విద్యార్థుల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి ఇక ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా స్పందిస్తూ  అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
ఉక్కు ఫ్యాక్ట‌రీ కావాల‌న్నందుకు ఉక్కుపాదం మోపుతారా...
 
ముఖ్య‌మంత్రి గారు... క‌డ‌ప‌లో ఉక్కు క‌ర్మాగారం అడిగిన విద్యార్థుల మీద మీరు క‌ర్క‌శంగా పోలీస్ బ‌ల‌గాన్ని ప్ర‌యోగించారు... విద్యార్ధుల ఒంటిమీద ప‌డిన ప్ర‌తీ ఒక్క దెబ్బ రాష్ట్ర ప్ర‌జ‌ల గుండెల మీద మీరు చేస్తున్న గాయ‌మే. విద్యార్ధి నాయ‌కుడు నాయ‌క్ ప‌రిస్థితి నాకు ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఆయ‌న‌కు వెంట‌నే మంచి వైద్యం చేయించండి. నాలుగేళ్ల కేంద్రమంత్రి వ‌ర్గంలో ఉన్న మీరు.... కేసుల కోసం, లంచాల కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను గాలికి వ‌దిలేయ‌డం వ‌ల్లే ఈ రోజు విద్యార్ధులు విప‌క్షాలు రోడ్డుకు ఎక్కాల్సి వ‌స్తోంది.
 
గతంలో విద్యుత్ చార్జీలు త‌గ్గించ‌నందుకు భ‌షీర్ భాగ్ లో ప్ర‌జ‌ల గుండెల మీద కాల్పించారు. ఇప్పుడు గ్రామ గ్రామ‌న‌, ప్ర‌తీ జిల్లాలో మీరు మీ పార్ట్‌న‌ర్లు చేసిన వంచ‌న మీద ప్ర‌జ‌లు గ‌ర్జిస్తున్నారు. చేతుల‌తో స‌మాధానం మీరు వారంద‌రికీ లాఠీల‌తో, తుపాకుల‌తో స‌మాధానం ఇస్తారా బాబుగారు ఇది దుర్మార్గం అంటూ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 
ఇక మ‌రోవైపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.