అదే నా ల‌క్ష్యం వైఎస్ జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-07 18:12:03

అదే నా ల‌క్ష్యం వైఎస్ జ‌గ‌న్

జాతీయ చేనేత దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా చేనేత కార్మికుల‌ను స్వ‌యంగా క‌లుసుకున్నారు. ఆ త‌ర్వాత‌ వారి ప‌రిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ‌తంలో తాము ఒక చీర నెయ్యాలంటే మూడు నుంచి నాలుగు రోజులు ప‌డుతుంద‌ని అయితే చీర నేసినందుకు త‌మ‌కు గిట్టుబాటు ధ‌ర కూడా రావ‌డంలేద‌ని చేనేత కార్మికుల‌కు జ‌గ‌న్ వివ‌రించారు. 
 
ఇక వారి భాధ‌ను విన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని సంచ‌ల‌న ట్వీట్ చేశారు. ముందుగా చేనేత కార్మికుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపి.. 2019లో వైసీపీ అధికారంలో వ‌స్తే  అకుంటిత దీక్ష‌తో నిరంత‌రం శ్ర‌మించే చేనేత కార్మికుల క‌ష్టాల‌ను తీర్చ‌డ‌మే త‌న ల‌క్ష్యం అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 
YS Jagan Mohan Reddy
‏Prosperity of our skilled and hard-working weaving community is my priority. #NationalHandloomDay
 
కాగా ఆయ‌న త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర టీడీపీ నాయ‌కుల కంచుకోట తూర్పు గోదావ‌రి జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటే అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.