వైసీపీ బంద్ పై జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-24 13:30:49

వైసీపీ బంద్ పై జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఐదు జిల్లాలను పూర్తిచేసుకుని ప్ర‌స్తుత టీడీపీ కంచుకోట తూర్పు గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతుంది.
 
ఈ పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ కేంద్ర ప్ర‌భుత్వానికి వ్వ‌తిరేకంగా ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ కు రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌ద్ద‌తు తెల‌పాల్సిందిపోయి అర్థ రాత్రి నుంచి వైసీపీ నాయ‌కుల‌ను అక్ర‌మ అరెస్ట్‌లు చేయిస్తున్నార‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. దీనిని బ‌ట్టి చూస్తుంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ప్ర‌త్యేక హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ది ఉందో తెలిసిపోయింద‌ని ఆరోపించారు.
 
ఇక‌ ఇదే విష‌యాన్ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియా ద్వారా కూడా స్పందించారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు, టీడీపీ వ్యతిరేకం కాకపోతే వైసీపీ బంద్ ను ఎందుకు అడ్డుకుంటున్నారు అని జ‌గ‌న్ ట్వీ ట్ చేశారు. ఇక ఆయ‌న చేసిన ట్వీట్ కు నేటిజ‌న్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిని తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
రాష్ట్రం బాగుపడితే @ncbn గారు తట్టుకోలేరు, ఇక ఆ పచ్చ తమ్ముళ్ల గురించి మాట్లాడుకోవడమే అనవసరం. ఇప్పటికే స్పెషల్ ప్యాకేజి లో వచ్చిన డబ్బు మొత్తం వచ్చే ఎన్నికలకి దాచుకున్నారు, ఇప్పుడు వైసీపీ బంద్ లకు సపోర్ట్ చేస్తే ఆ డబ్బు కి లెక్కలు అడుగుతారు గా.. అందుకే సైలెంట్ అవుతున్నార‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.