అదే నా ల‌క్ష్యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-15 14:54:55

అదే నా ల‌క్ష్యం

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నిన్న‌టితో  161 రోజులును  పూర్తి చేసుకుని నేడు 162 వ రోజులోకి అడుగు వేశారు జ‌గ‌న్. ఇక ఆయ‌న చేప‌ట్టిన ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు అడుగ‌డుగునా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.ఇక  ప్ర‌స్తుతం ఈ సంక‌ల్ప‌యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌కవ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా స‌మ‌స్యల‌ను తెలుసుకుంటూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ఒక్కొక్క‌టి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
అయితే ఇక తాజ‌గా జ‌గ‌న్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ను వేదిక‌గా చేసుకుని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిని నేటిజ‌న్లు, వైసీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఫిదా అవుతున్నారు. ఏపీలో నిజ‌మైన నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారా!  అంటే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది ఇక్క వైఎస్ జ‌గ‌న్ అని నేటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో ఉండేందుకు మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం తాను తీసుకువ‌స్తాన‌ని జ‌గ‌న్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజే 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 
ఇక ఆయన ట్వీట్‌ ఇలా ఉంది.. ఆంధ్రప్రదేశ్‌లోని పౌరులందరి ఆనందోత్సాహాల మధ్య 2004 మే 14న రాజన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజలందరి ఉన్నతిని కాంక్షించే అద్భుతమైన సంక్షేమ పథకాలపైనే ఆయన దృష్టి పెట్టార‌ని జ‌గ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు. అలాగే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అదే నెల, తేదీ (మే 14) నా పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తవ్వడం చారిత్రక సంఘటన అని పేర్కొన్నారు. రాజన్న రాజ్యంతో మళ్లీ యావత్‌ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు తేవాలన్నదే నా లక్ష్యం అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 
YS Jagan Mohan Reddy,
‏On 14th May,2004,every citizen of AP was jubilant,as Rajanna took oath as AP’s CM. His vision & welfare policies ameliorated the lives of all. As I complete 2000kms of #PrajaSankalpaYatra,on the very same day,this year, I vow to bring back your smiles & restore Rajanna's Rajyam!

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.