జ‌గ‌న్ సూప‌ర్ డెసిష‌న్ రాజీనామా చేయాల్సిందే నోమోర్ ఆప్ష‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 18:15:38

జ‌గ‌న్ సూప‌ర్ డెసిష‌న్ రాజీనామా చేయాల్సిందే నోమోర్ ఆప్ష‌న్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్రను త‌ల‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్స‌యాత్ర రాయ‌ల‌సీమలోని నాలుగు జిల్లాల‌ను, అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.  ఈ జిల్లాలో ఇంకా వ‌చ్చే నెల 14వ తేది వ‌ర‌కూ జ‌గ‌న్ పాద‌యాత్ర జ‌ర‌గనుంద‌ని తెలుస్తోంది.
 
ఇక వ‌చ్చే నెల 15వ తేదిలోపు వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో భాగంగా విశాఖ జిల్లాలోకి అడుగు పెట్ట‌నున్నారు. కాగా ఇప్ప‌టికే పాద‌యాత్ర రూట్ మ్యాప్ ను డిసైడ్ చేసిన‌ట్లు తెలుస్తుంది. ఈ మ్యాప్ లో మార్పులు, చేర్పులు ఉండ‌వ‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు. ఈ రూట్ మ్యాప్ లో మిగిలిపోయిన నియోజ‌వ‌ర్గాల‌న్నింటిని జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి చేసుకున్న త‌ర్వాత‌ బస్సు యాత్రతో విశాఖ సిటి ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.
 
జ‌గ‌న్ ప‌క్క జిల్లాలో పాద‌యాత్ర చేస్తుండ‌టంతో వైసీపీ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు అంద‌రూ ఎప్పుడెప్పుడు జ‌న‌నేత త‌మ ప్రాంతానికి వ‌స్తారా అని ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇక‌ మ‌రో వైపు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మాత్రం జ‌గ‌న్ విశాఖ‌లోకి అడుగు పెడితే రాజ‌కీయాలు తారుమారు అవుతాయ‌ని భ‌యాందోళ‌న‌కు చెందుతున్నారు. ఈ జిల్లాలో కీల‌కమైన వ్య‌క్తి మంత్రి గంటా శ్రీనివాసు రావును కూడా పార్టీలోకి ర‌ప్పించేందుకు వైసీపీ నాయ‌కులు తీవ్ర‌మైన‌ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. గంటా పార్టీలోకి వ‌స్తే జ‌గ‌న్ ఆహ్వానిస్తార‌ట‌. కానీ టీడీపీకి రాజీనామా చేసి రావాల‌ని సూచించార‌ట‌. 
 
మ‌రికొద్ది రోజుల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశాఖ‌లో అడుగు పెట్టనున్న నేప‌థ్యంలో వీలైనంత‌ వ‌ర‌కూ టీడీపీలో ఉన్న నాయ‌కుల‌ను వైసీపీ లో చేర్పించేందుకు పార్టీ నాయ‌కులు విశ్వ‌ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చాలా కాలంగా టీడీపీపై గుర్రుగా ఉన్న‌ త‌మ్ముళ్ల‌ను టార్గెట్ చేసుకుని పార్టీ నాయ‌కులు వారిపై ఫోక‌స్ చేస్తున్నారు.
 
దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయ‌కుల‌ను కూడా వైసీపీలో చేర్పించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయి. గ‌తంలో వైసీపీ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతం. మా తలుపులు తెరిచే ఉన్నాయని ప్ర‌క‌ట‌న చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీలోకి వ‌చ్చేముందు త‌మ పార్టీకి రాజీనామా చేసి ఆ త‌ర్వాత పార్టీలోకి రావాల‌ని ష‌ర‌తులు విధించారు. దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఏ జిల్లాలో రానన్ని విధంగా విశాఖ‌లో అధిక‌సంఖ్యలో వ‌ల‌స‌లు వ‌స్తాయ‌ని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.