చిన్నాయ‌నా.. ఎక్కువ చేస్తున్నావ్ జాగ్ర‌త్త‌ జ‌గ‌న్ క్లాస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-02 17:52:27

చిన్నాయ‌నా.. ఎక్కువ చేస్తున్నావ్ జాగ్ర‌త్త‌ జ‌గ‌న్ క్లాస్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్పయాత్ర‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు కేవ‌లం 1.5 ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇది రిపీట్ కాకుండా జాగ్ర‌త్త‌గా పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పార్టీ నాయ‌కులు కొంద‌రు ఇష్టాను సారంగా వ్య‌వ‌హరిస్తున్నారు. 
 
తాజాగా ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్య‌వ‌హారం కూడా వెలుగు చూసింది. వైఎస్ జ‌గ‌న్ కు వైవీ సుబ్బారెడ్డి బాబాయ్ వ‌రుస అవుతారు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు పార్టీ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని తెలియ‌డంతో ప్ర‌త్యేకంగా జ‌గ‌న్, వైవీని పిలిపించుకుని గ‌ట్టిగా  క్లాస్ తీసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.
 
త‌న‌కు న‌చ్చిన వారికి అనుకూలంగా రిపోర్టులు ఇస్తూ, న‌చ్చ‌ని వారికి నెగిటివ్ గా రిపోర్టుల‌ను ఇస్తూ జిల్లాలోని వైసీపీ నాయ‌కులను వైవీ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. అంతే కాదు ప‌శ్చిమగోదావ‌రి, తూర్పు గోదావ‌రి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక వ్యవహారాల్లో కూడా వైవీ సుబ్బారెడ్డి ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లు తెలియ‌డంతో బాబాయ్ కి జ‌గ‌న్ గ‌ట్టిగా క్లాస్ తీసుకున్నారు. పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న మీరు ఇలా ప్ర‌వ‌ర్తించ‌డం ఏంట‌ని జ‌గ‌న్ మంద‌లించార‌ట‌. ఇక నుంచి అయిన పార్టీ నిర్ణ‌యం మేర‌కు అంద‌రితో క‌లిసి క‌ట్టుగా ప‌నిచేయాల‌ని జ‌గ‌న్ కోరార‌ట‌. ఇక జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు వైవీ సుబ్బారెడ్డి కూడా ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.