జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-28 17:17:56

జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ప‌శ్చ‌మ‌గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఇక ఈ సంక‌ల్ప‌యాత్రలో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ తాము అధికాంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు జ‌గ‌న్.
 
ఇక తాజాగా ఈ సంకల్ప‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ మీడియా స‌మావేశం ఏర్పాటుచేసి మ‌రోసారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావును చంద్ర‌బాబుబు వెన్నుపోటు పొడిచి ఈరోజు ఆయ‌న జయంతి వేడుకలు చేయ‌డం ఏంట‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.
 
గ‌తంలో చంద్ర‌బాబు, ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడ‌వ‌డ‌మే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్, ఆయన ఇల్లు, పార్టీని లాగేసుకున్నారని, ఇక చివరకు ఆయన మృతికి కూడా చంద్రబాబే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు జ‌గ‌న్. గ‌తంలో తెలుగు రాష్ట్రాల‌ను అన్యాయంగా విడ‌గొట్టిన చంద్ర‌బాబు ఇప్ప‌డు మ‌హానాడు స‌భ‌లో ముస‌లి క‌న్నీరు కారుస్తున్నార‌ని ఆరోపించారు. అయితే ఇదే మ‌హానాడు స‌భ‌ను తెలంగాణ‌లో ఏర్పాటు చేసిన‌ప్పుడు త‌న వ‌ల్లే తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింద‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌ని జ‌గ‌న్ అన్నారు. 
 
చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక‌ అవినీతి అక్ర‌మాల్లో కూరుకుపోయిందని, 2019 ఎన్నిల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత టీడీపీ అవినీతిని రూపుమాపుతామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అలాగే ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంటిస్తామని అన్నారు. దీంతో పాటు ఐస్ ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్లకు రూ.5 కే కరెంట్ ఇస్తామని, దళారీ వ్యవస్థపై ఉక్కుపాదంమోపి, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు, కోల్డు స్టోరేజీలు నెలకొల్పుతామని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.