ఫిరాయింపు సెగ్మెంట్ పై జ‌గన్ స్కెచ్ అదిరింది

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-28 14:39:13

ఫిరాయింపు సెగ్మెంట్ పై జ‌గన్ స్కెచ్ అదిరింది

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత మొద‌టి సారి 2014లో హోరా హోరీగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే  ఆ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించిన హామీల‌కు ప్ర‌జ‌లు ఆక‌ర్షితులై ఆయ‌న‌కు అధికార ప‌గ్గాల‌ను అప్ప‌గించారు. అయితే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన హామీల్లో ఒక్క‌టంటే ఒక్క‌టి నెవేర్చ‌లేదు. 
 
టీడీపీ నాయ‌కులు హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోయినా కూడా అభివృద్ది పేరుతో సుమారు 23 మంది ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యంగానికి విరుద్దంగా అధికార ప్ర‌లోభాల‌కు, మంత్రి ప‌ద‌వుల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌జులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మీద ప్రేమ‌తో, విశ్వాసంతో వీరికి ఓట్లువేసి గెలిపించారు. కానీ ఈ 23 మంది మాత్రం ప్ర‌జ‌ల విశ్వాసానికి చెర‌గ‌ని మ‌చ్చ‌ను తెచ్చిపెట్టారు.
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా వీరికి చెక్ పెట్టాల‌నే ఉద్దేశ్యంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యూహ‌లు ర‌చిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ కంచుకోట అనంత‌పురం జిల్లా ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై ఎక్క‌వ ఫోకస్ చేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో 14 అసెంబ్లీ స్థానాల‌కు గాను టీడీపీ 12 స్థానాల‌ను గెలుచుకోగా వైసీపీ కేవ‌లం ఉర‌వ‌కొండ, క‌దిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే వైసీపీ జెండా ఎగర‌వేసింది. 
 
అయితే ఊహించ‌ని ప‌రినామాల నేప‌థ్యంలో క‌దిరి ఎమ్మెల్యే చంద్ బాషా, ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్ రెడ్డి అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో లాగైనా వీరికి చెక్ పెట్టేందుకు జ‌గ‌న్ స‌రికొత్త ప్లాన్ వెస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ముందుగా క‌దిరి ఎమ్మెల్యే అత్త‌ర్ చాంద్ బాషాపై జ‌గ‌న్ ఫోకస్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.ఈయ‌న గతంలో మైనార్టీ త‌రపున మంత్రి ప‌ద‌వి వ‌స్తుంది ఆసించి టీడీపీ తీర్థం తీసుకుంటే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాత్రం మైనార్టీల్లో ఒక్క‌రికి కూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. 
 
ఇక క‌దిరిలో బాషా గ్రాఫ్ త‌గ్గించాల‌నే క్ర‌మంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ త‌రుపున సిద్దారెడ్డిని నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్తగా గా నియ‌మించారు. జ‌గ‌న్ ఆయ‌న‌ను ఎప్పుడు అయితే నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్తగా నియ‌మించారో అప్ప‌టినుంచి ప్ర‌జ‌ల్లో దూసుకుపోతున్నారు. 2014లో  టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏ విధంగా ప్ర‌జ‌లు మొసం చేశారో, అలాగే క‌దిరి నియోజ‌క‌వ‌ర్గంలో చాంద్ బాషా చేస్తున్న ప‌రిపాల గురించి ప్ర‌జ‌ల‌కు క్షుణ్ణంగా వివ‌రిస్తున్నారు సిద్దారెడ్డి.
 
అయితే ఇదే క్ర‌మంలో వైసీపీ త‌ర‌పున సిద్దారెడ్డితో పాటు భాస్క‌ర రెడ్డి కూడా యాక్టీవ్ గా ఉన్నారు. ఈ క్ర‌మంలో సిద్దారెడ్డి గురించి నెగిటివ్ గా భాప్క‌ర రెడ్డి అనుచ‌రులు జ‌గ‌న్ కు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితిలో అధినేత సిద్దారెడ్డినే భ‌రిలో దించేందుకు సిద్దంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణ‌లో వైసీపీ త‌ర‌పున ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక  కీల‌క స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వే ప్ర‌కారం సిద్దారెడ్డికి ప్ర‌జాధ‌ర‌న ఎక్కువ‌గా పెరిగింది క‌నుక జ‌గ‌న్ ఆయ‌న‌నే భ‌రిలోకి దించేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది.
 
ఇక సిద్దారెడ్డి బాస్క‌ర రెడ్డి వ‌ర్గ‌పోరును త‌గ్గించుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వైసీపీనే విజ‌యం సాదిస్తోంద‌ని తెలుస్తోంది. ఇటు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బాంద్ బాషాకు టీడీపీ త‌ర‌పున‌ టికెట్ ఇస్తోరో లేదో తెలియ‌దు కాని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సిద్దారెడ్డి మాత్రం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిస్కారంలో దూసుకుపోతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ వేసిన ప్లాన్ స‌క్సెస్ అయింద‌నే చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.