జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌టన.....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-08 10:32:26

జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌టన.....

ఎన్డీఏలో ఇంకా కొన‌సాగుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చెప్పే మాటలు ప్ర‌జ‌లు న‌మ్మేలా లేర‌ని, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు.. ఇప్ప‌టికే రెండేళ్ల క్రిత‌మే ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ గ‌తంలో ఎటువంటి మాట‌లు మాట్లాడారో నిన్న‌కూడా అటువంటి మాట‌లే మాట్లాడారు  అని ఆయ‌న అన్నారు...
 
ఇక ఇద్ద‌రు కేబినెట్ మంత్రుల‌ను త‌న పార్టీ త‌ర‌పున వెన‌క్కి తీసుకుంటున్నాన‌ని, రాజీనామా చేయిస్తున్నాన‌ని చెప్ప‌డం పై జ‌గ‌న్ స్పందించారు.. ఈ ప‌ని ముందే చేసి ఉంటే ఈ స‌మ‌యానికి ప్ర‌త్యేక హూదా వ‌చ్చేది అని అన్నారు జ‌గ‌న్..
 
ఇక అవిశ్వాస తీర్మానం ఈ నెల 21 న ప్ర‌వేశ పెడుతున్నాం, 25 మంది ఏపీ ఎంపీలు క‌లిసి అవిశ్వాస తీర్మానం పెడితే బాగుంటుంది దానికి ఓ స‌త్తా ఉంటుంది అని అన్నారు.. అందుకే క‌లిసి రావాలి అని అన్నారు జ‌గ‌న్...అంద‌రూ క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హూదా సాధించుకోవాలి అని పిలుపునిచ్చారు వైసీపీ అధినేత జ‌గ‌న్..
 
ఇక అవిశ్వాస తీర్మానం ముందు పెట్ట‌మ‌న్నా పెడ‌తామ‌ని, ఒక‌వేళ మీరు అవిశ్వాస తీర్మానం పెడ‌తాం అన్నా దానికి స‌పోర్ట్ ఇస్తామ‌ని ఈ స‌మ‌యం ఎందుకు ఇస్తున్నామంటే బాబుకు ఆలోచించుకోవ‌డానికి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి స‌మ‌యం ఇస్తున్నాం అని అన్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. మొత్తానికి ఏపీ రాజ‌కీయాలు హస్తినలో పోరుతో మ‌రింత హీటెక్కాయి అని చెప్పాలి..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.