ఆ పార్టీకే మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి సిద్దం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-23 08:03:09

ఆ పార్టీకే మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి సిద్దం

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో భాగంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పాద‌యాత్ర 900 కిలో మీట‌ర్లు మైలు రాయి పూర్తి అయిన సంద‌ర్భంగా జ‌గ‌న్ సీఎన్ ఎన్ -ఐబిఎన్ కు ప్ర‌త్యేక ఇంటర్వూ ఇచ్చారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం హోదా క‌ల్పిస్తే బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వాడానికి సిద్ద‌మ‌ని వైయ‌స్ జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. హోదా ఇచ్చే అధికారంలో ఉన్న ప్ర‌ధాన‌మంత్రికి ఉంద‌ని, ఒక‌వేళ బీజేపీ ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటే ఖ‌చ్చితంగా ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఆయ‌న అన్నారు. 
 
హోదా కోసం వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న గుర్తు చేయ‌డంతో పాటు, ఇక‌పై కూడా హోదా కోసం పోరాడ‌తామ‌ని చెప్పుకొచ్చారు.  ఇక  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను,మోసాల‌ను,అవినీతిని  ఆయ‌న ఇంట‌ర్వూలో సుధీర్ఘంగా ప్ర‌స్తావించారు. 
 
కేసుల విష‌యంపై వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ....త‌న‌పై న‌మోదైన కేసుల‌న్నీ కక్ష్య సాధింపులో భాగంగా పెట్టిన‌వ‌ని, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం నాపై కేసులు లేవు... కాంగ్రెస్ పార్టీని వీడ‌గానే నాపై కేసులు పుట్టాయ‌ని గుర్తు చేశారు.  ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన చంద్ర‌బాబుపై ఇప్ప‌టికీ ఎలాంటి కేసులు లేవ‌ని ఆయ‌న ఆరోపించారు. 
 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.