జ‌గ‌న్ స‌రికొత్త అస్త్రం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-29 12:05:06

జ‌గ‌న్ స‌రికొత్త అస్త్రం

వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యమే ల‌క్ష్యంగా దూసుకుపోతున్నారు. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో పొత్తులు లేకుండా, ముందుకు వెళ్లాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయ‌న తీసుకునే నిర్ణ‌యాలు కూడా వైసీపీ నాయ‌కులు ముందుకు తీసుకువెళుతున్నారు. జ‌గ‌న్ జిల్లాలపై ఇప్ప‌టికే ఫోక‌స్ పెట్టారు. అలాగే జ‌గ‌న్ అన్ని జిల్లాల‌లో నియోజ‌క‌ర్గ ఇంచార్జిలను నియ‌మించారు. అలాగే ప్ర‌తీ చోట నాయ‌కుల మ‌ధ్య విభేదాలు లేకుండా ప‌ద‌వుల వ్య‌వ‌హారంలో, ఇబ్బంది త‌లెత్త‌కుండా బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్నారు జ‌గ‌న్.
 
ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో చిత్తూరు జిల్లా రాజ‌కీయాల పై జ‌గ‌న్ ఫోక‌స్ పెట్టారు. ముఖ్యంగా ఈ జిల్లా టీడీపీ కంచుకోట‌గా భావిస్తుంది. పైగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సొంత జిల్లా, అలాగే ఇక్కడ నుంచి మంత్రులుగా బాబు అనుచరులు ఉంటారు కాబట్టి, అభివృద్దికి డోకా లేదు అనుకుంటారు జ‌నాలు. కాని ఈ జిల్లాలో సీన్ రివ‌ర్స్ గా ఉంది.
 
చిత్తూరు జిల్లా పై వైసీపీ ఫోక‌స్ చేసింది. ఈ బాధ్యతలను పెద్ది రెడ్డి కుటుంబానికి అప్పగించారు జగన్...చిత్తూరు జిల్లాను పెద్ది రెడ్డి ఫామిలీ ఎప్పటి నుంచో శాసిస్తుంది.. ఈ జిల్లాలో పెద్ది రెడ్డి ఫ్యామిలీకి మంచి పేరు ఉంది... ఈ మంచి పేరుతోనే జిల్లాలో అందరూ పెద్ది రెడ్డి ఫ్యామిలీకి మర్యాద ఇస్తారు...
 
దానికి తోడు పెద్దిరెడ్డి ఫ్యామిలీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే పెద్ది రెడ్డి ఫ్యామిలీ ముందుంటుంది...అందుకే చిత్తూరు జిల్లా ప్రజలు పెద్ది రెడ్డి ఫ్యామిలీకి బ్రహ్మరధం పడుతున్నారు... 
 
ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి సీనియర్ నాయకులు...చిత్తూరు జిల్లా రాజకీయాలు అన్ని ఆయనకు తెలుసు...టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ పెద్ది రెడ్డి ముందు చంద్రబాబు పాచిక పారడం లేదు..2014 ఎన్నికలలో కూడా టీడీపీ కంటే వైసీపీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంది...
 
చిత్తూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాలలో 12 సీట్లు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి...ఈ జిల్లా నుండే ముఖ్యమంత్రి ఉన్నపటికీ అభివృద్ధి కూడా ఆమడ దూరంలో ఉంది కాబట్టి, గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు కూడా టీడీపీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో బారి స్థాయిలో వ్యతిరేఖత ఉంది.. ఈ జిల్లాలో మెజార్టీ వైసీపీసీట్లు సాధించ‌డంతో బాబు కూడా జిల్లా పై అంత ప్రేమ‌చూప‌డం లేదు అంటున్నారు అక్క‌డ ప్ర‌జ‌లు..ఇది వైసీపీకి కలిసివచ్చే అవకాశం ఉంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.