ఉమాకు జ‌గ‌న్ చెక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-09 15:29:30

ఉమాకు జ‌గ‌న్ చెక్

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారమే ల‌క్ష్యంగా చేసుకుని తాను తీసుకునే నిర్ణ‌యంలో ఒకటికి ప‌ది సార్లు ఆలోచించి, ఈ విష‌యంపై పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ జ‌రిపి ఆ త‌ర్వాత ఫైన‌ల్ నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ఇక‌ జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ఉన్నార‌ని తెలుస్తోంది.
 
ఒక ప‌క్క పాద‌యాత్ర‌చేస్తూ మ‌రో ప‌క్క ఆయా నియోజ‌కవ‌ర్గాలలో వచ్చే ఎన్నిక‌ల‌కు ఎవ‌రిని నిల‌బెడితే బాగుంటుంది అనే విష‌యంపై జ‌గ‌న్ ప‌క‌ట్బందిగా నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ట‌. ఇందుకోసం ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ కూడా తీవ్రంగా శ్ర‌మిస్తోందట‌.అయితే ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణా జిల్లాలో సార్వ‌త్రిక ఎన్నిలు ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఈ జిల్లాలో ప‌ట్టు సాధించాల‌నే ఆశ‌తో వైసీపీ పావులు క‌దుపుతోంది. ఇందుకోసం మ‌చ్చిప‌ట్టున్న అభ్య‌ర్థిని బ‌రిలో దించేందుకు జ‌గ‌న్ వ్యూహాలు ర‌చిస్తున్నార‌ట‌. 
 
కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ కు కేవ‌లం ఐదు స్థానాలు వ‌చ్చాయి. ఇక రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి సేమ్ సీన్ రిపీట్ చేయాల‌నే నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ జిల్లాలో బ‌ల‌మైన నాయ‌కుల‌ను బ‌రిలోకి దించేందుకు చూస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ జిల్లానుంచి మైల‌వ‌రంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన దేవినేని ఉమాకు చెక్ పెట్టేందుకు తీవ్ర ప్ర‌యత్నాలు చేస్తున్నారు జ‌గ‌న్. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున జోగి ర‌మేష్ పోటీ చేసి దేవినేని ఉమా చేతిలో7607 పైచిలుకు ఓట్ల‌తో ఓట‌మి పాల‌య్యారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మైల‌వ‌రంలో ఉమా ఎలాంటి అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేయ‌లేదు దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జోగి ర‌మేష్ క‌చ్చితంగా ఎమ్మెల్యే అవుతార‌ని మైల‌వ‌రం ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.
 
అయితే రీసెంట్ గా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్, జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకోవ‌డంతో ఆయ‌న మైల‌వ‌రంలో చ‌క్రం తిప్పుతార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. .వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను మైలవరం నుంచి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీద పోటీకి దింపడానికి వైసీపీ నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంద‌ని తెలుస్తోంది. ఇక‌ మైల‌వ‌రంలో ఇంచార్జ్ గా ఉన్న జోగి ర‌మేష్ ను తిరిగి పెడ‌న‌కు పంపించి ఆయ‌న స్థానంలో కేపీకు బాధ్య‌త‌ల‌ను అప్పగించ‌నున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.
 
మైల‌వ‌రానికి చెందిన ర‌మేష్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెడ‌న నుంచి బ‌రిలోకి దించేతే విజ‌యం సాధిస్తారా అంటే కచ్చితంగా విజ‌యం సాధిస్తారు. ఎందుకంటే 2009 వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో పెడ‌న నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీచేసి గెలిచారు. దీంతో అక్క‌డ కూడా ర‌మేష్ కు ప్ర‌జాధ‌ర‌ణ ఎక్కువ‌గా ఉంది. దీంతో ఆయ‌న గెలుపు ఖాయం అని విశ్లేష‌కులు అంటున్నారు. ఇక మైలవ‌రం విష‌యానికి వ‌స్తే కేపీకు ఈ నియోజ‌కవ‌ర్గంలో అంత‌గా ప్ర‌జాధ‌ర‌ణ‌లేదు కేవ‌లం నందిగామ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే ప‌ట్టు ఉంది. మైల‌వ‌రంలో ప్ర‌జాధ‌ర‌ణ లేదు ఎలా గెల‌స్తార‌నే ప్ర‌శ్న అంద‌రి వ‌స్తోంది. కానీ క‌చ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఇంచార్జ్ గా ఉన్న జోగి ర‌మేష్ ఓటు బ్యాంక్ మొత్తం కృష్ణ ప్ర‌సాద్ కు మ‌ద్ద‌తు తెలుపుతుంది కాబ‌ట్టి ఆయ‌న గెల‌వ‌డం సుల‌భం అని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.