జ‌గ‌న్ స‌రికొత్త స్ట్రాట‌జీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 12:42:01

జ‌గ‌న్ స‌రికొత్త స్ట్రాట‌జీ

రాయ‌ల‌సీమ నాలుగు జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి చేసుకుని పంచ తంత్రంతో నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర కొన‌సాగిస్తున్నారు జ‌గ‌న్ .. ఇక ఈ నెల మ‌ధ్య‌లోనే ప్ర‌కాశం జిల్లాలోకి జ‌గ‌న్ పాద‌యాత్ర చేరనుంది.. మొత్తానికి జ‌గ‌న్ ఐదో జిల్లాలో పాద‌యాత్ర ఫైన‌ల్ ద‌శ‌కు చేరుకుంటోంది...రాయ‌ల‌సీమలో జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు బ్రహ్మ‌ర‌థం ప‌ట్టారు.. మిగిలిన ప్రాంతాల‌లో కూడా జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు భారీ ఎత్తున త‌రలి వ‌స్తున్నారు.. ఆయ‌న కు ప్ర‌జాబ‌లం ఎంత మెండుగా ఉందో? ఆ జ‌నసంద్రోహాన్ని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
 
175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈసారి పార్టీ త‌ర‌పున మ‌రింత  గ్రిప్ తెచ్చెకుని, రాజ‌కీయంగా ముందుకు వెళ్లాలి అని ఆయ‌న భావిస్తున్నారు.. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం గ‌త ఎన్నిక‌ల మేనిఫెస్టో పై  నాయ‌కులు ఆలోచ‌న చేస్తున్నారు.. రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర పూర్తి చేసిన ప్ర‌తీ సెగ్మెంట్లో వైసీపీ బ‌లం గ‌తం కంటే పుంజుకుంది, అనేది తాజా స‌ర్వేలో వెల్ల‌డైంది.
 
జ‌గ‌న్ చిత్తూరు జిల్లాలో ఈ సారి క్లీన్ స్వీపై పై ఆలోచ‌న చేస్తున్నారు... ఇక్క‌డ తెలుగుదేశానికి మెజార్టీ ఉన్న ప్రాంతాలు కూడా జ‌గ‌న్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కంచుకోట‌లుగా మార‌నున్నాయి..  జ‌గ‌న్ కుప్పం నియోజకవర్గంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని అభ్యర్ధిగా ప్రకటించిన విష‌యం తెలిసిందే.
 
క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అయినా ప్ర‌జ‌ల్లో పేరు ఉంది దీనిని జ‌గ‌న్ గుర్తించారు...  అలాగే పాద‌యాత్ర‌లో భాగంగా  వైసీపీ  అధికారంలోకి వస్తే చంద్రమౌళిని ఏకంగా మంత్రివర్గంలోకే తీసుకుంటామని బహిరంగంగా ప్ర‌జ‌లు అంద‌రి ముందు హామీ ఇచ్చారు.. దీంతో రాజ‌మౌళికి మ‌రింత ప్ల‌స్ అయింది జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో.
 
కుప్పం అంటే తెలుగుదేశం అధినేత‌కు విజ‌యం అందించిన ప్రాంతం, అలాగే తెలుగుదేశంలో ఎంతో క్రెడిట్ తెచ్చుకున్న సెగ్మెంట్... ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా ఉండి... సీఎంగా గెలిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయ‌లేదు అని అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.. ఇక్క‌డ అబ్జ‌ర్వ్ చేస్తే
 
రాజ‌కీయంగా ఆలోచిస్తే ఆరుసార్లు జానారెడ్డి  న‌ల్గొండ జిల్లా నుంచి  ఎమ్మెల్యేగా గెలిస్తే, ఇటు చంద్ర‌బాబు కుప్పం నుంచి  అటు తాడిప‌త్రి నుంచి జేసి దివాక‌ర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు... ఈసారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రికార్డు కూడా నెల‌కొల్ప‌నున్నారు జానారెడ్డి - చంద్ర‌బాబు.. 
 
అయితే ఇక్క‌డ జ‌గ‌న్ మాత్రం తెలుగుదేశం అధినేత‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేలా చూస్తున్నారు.. మంత్రిగా చంద్ర‌మౌళిని తీసుకుంటాను, కుప్పాన్ని మ‌రింత ప్ర‌గ‌తిప‌థంలో తీసుకువెళ‌తాను అని చెప్ప‌డంతో, అక్క‌డ ప్ర‌జ‌లు కూడా వైసీపీ వైపు మ‌ర‌లుతున్నారు. ఇక్క‌డ వైకాపా నాయకుడు మునుస్వామిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.