జ‌గ‌న్ ఆ జిల్లాలో వ‌దిలిన బాణం సక్సెస్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-31 14:15:33

జ‌గ‌న్ ఆ జిల్లాలో వ‌దిలిన బాణం సక్సెస్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చావో రేవో తేల్చుకోవ‌డానికి అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ నాయ‌కుల‌తో పాటు ఇత‌ర పార్టీ నాయ‌కులు కూడా స‌న్నద్దం అవుతున్నాయి. గతంలో ఈ జిల్లాలో బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత క‌నుమరుగై పోయింది. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో ఆ స్థానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భ‌ర్తి చేసింది.
 
1999 నుంచి 2014 వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల‌ను ఒక్క‌సారి గ‌మ‌నించిన‌ట్లు అయితే 2009 ముందు వ‌ర‌కు ఈ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. ఇక పున‌ర్విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత కంభం, మార్టూర్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను తొల‌గించి గ‌తంలో ఉన్న ఎర్ర‌కొండ‌పాలేంను తిరిగి నియోజ‌క‌వ‌ర్గాన్ని చేశారు. దీంతో  ఈ జిల్లాలో నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య 12కు అయింది. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీకే ఎక్కువ సీట్లు రావ‌డంతో ప్ర‌కాశం జిల్లాపై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది అధికార తెలుగు దేశం పార్టీ.
 
రెండు ద‌శాబ్దాల రాజ‌కీయాన్ని ఒక్క‌సారి గ‌మ‌నించిన‌ట్లయితే 1999లో 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ 7సీట్ల‌ను గెలుచుకుంటే కాంగ్రెస్ ఆరు స్థానాల‌ను ద‌క్కించుకుంది. ఇక 2004 ఎన్నిక‌ల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజ‌యాన్ని సాధించింది. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీచేసిన క‌ర‌ణం బ‌ల‌రాం మాత్ర‌మే అద్దంకి నుంచి పోటీ చేసి గెలిచారు. ద‌ర్శిలో ఇండిపెండెంట్ గా గెలిచిన బూచేప‌ల్లి సుబ్బారెడ్డి ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
 
ఇక 2009 ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ హ‌వానే కొన‌సాగింది. ఆ ఎన్నిక‌ల్లో 10 చోట్ల కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలిస్తే టీడీపీ, పీఆర్పీ చెరో సీటును గెలుచుకున్నాయి. 2012లో వైసీపీలో చేరి అన‌ర్హ‌త వేటు ప‌డ్డ ఒంగోలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉపఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి వ‌రుస‌గా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నాల్గ‌వసారి గెలిచారు. 
 
ఇక రాష్ట్ర విభ‌జ‌న‌తో ప్ర‌కాశం జిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా క‌నుమ‌రుగు అయిపోయింది. ఇక 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీల మ‌ధ్య ప్ర‌దాన పోటీ జ‌రిగింది. అయితే ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆరుస్థానాల్లో టీడీపీ ఐదు స్థాన‌ల్లో గెలిచాయి. చీరాల‌లో ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి ఆ త‌ర్వాత అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ఆయ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. ఇక ఆయ‌న‌తోపాటు వైసీపీ నుంచి సుమారు న‌లుగురు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం తీసుకున్నారు. 
 
ఇక ఈ స్థానాల్లో కొత్త‌వారిని బ‌రిలోకి దించి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కు చెక్ పెట్టాల‌ని వైఎస్ జ‌గ‌న్ వ్యూహాలు ర‌చిస్తున్నారు. ఈ త‌రుణంలో రాజ‌కీయ సీనియ‌ర్ మాజీ మంత్రి మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. ఇక మిగిలిన ఫిరాయింపు నియోజ‌వ‌ర‌ర్గాల్లో బ‌ల‌మైన నాయ‌కులను వెతికి భ‌రిలోకి దించే కార్య‌క్ర‌మంలో వైసీపీ స‌న్నాహాలు చేస్తోంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ తో పాటు టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నాయ‌కుల‌ను వైసీపీ నాయ‌కులు సంప్ర‌దింపులు చేసి వారిని పార్టీలో చేర్చుకునేందుకు ట్రై చేస్తోంది. మొత్తానికి జ‌గ‌న్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వ‌దిలిన బాణం స‌క్సెస్‌ అవుతుంద‌నే చెప్పాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.