పులివెందుల‌లో పులిబిడ్డ జ‌గ‌న్ అదిపోయే ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-04 16:07:53

పులివెందుల‌లో పులిబిడ్డ జ‌గ‌న్ అదిపోయే ప్లాన్

క‌డ‌ప జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం అంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది వైఎస్సార్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ రాజా రెడ్డి నుంచి నేటి ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర‌కు ప్ర‌జా సేవ చేయ‌డంలో కానీ రాజ‌కీయంగా కానీ ఓ వెలుగు వెలిగారు.  
 
వైఎస్ కుటుంబం రాజ‌కీయ అరంగేట్రం చేసిన‌ప్ప‌టినుంచి పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌సారి కూడా ఓట‌మిని చ‌విచూడ‌లేదు. దీంతో రాష్ట్ర రాజ‌కీయాల్లో వైస్ ఫ్యామిలీ సంచ‌ల‌న రికార్డ్ ను సృష్టించింది. ఇక‌ తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో మొద‌టి సారిగా ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థిపై 75 వేల ఓట్ల‌తో అఖండ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌గ‌న్ పోటీ చేసి మ‌రోసారి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసేందుకు సిద్ద‌మ‌య్యారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పూర్తి అవ్వ‌గానే జ‌గ‌న్ ఉత్త‌రాంధ్ర నుంచి హైద‌రాబాద్ కు చేరుకుని అక్క‌డ 15 రోజులు విరామం తీసుకుంటారు.
 
ఆ త‌ర్వాత త‌న సొంత జిల్లా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌యాణించ‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జిల్లాలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌తో సంబందం లేకుండా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ప్ర‌తీ గ్రామానికి వెళ్లి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు రెడి అయ్యార‌ట‌. అంతేకాదు వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా వారిస‌మ‌స్య‌ల‌ను తీర్చుతాన‌ని జ‌గ‌న్ భ‌రోసా ఇవ్వ‌నున్నార‌ట‌. 
 
2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి పులివెందుల నియోజ‌కవ‌ర్గంలో ఏ మేర‌కు అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేశార‌నే విష‌యాల‌ను జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌ను అడిగి తెలుసుకోనున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతోపాటు గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఎన్ని హామీల‌ను ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల‌ను మోసం చేసిందో వాట‌న్నింటిని ప్ర‌స్తావిస్తూ క‌ర‌ప‌త్రాల‌ను విడుద‌ల చేయాల‌ని వైసీపీ నాయ‌కులు భావిస్తున్నారు. ఇక ఈ విష‌యంపై జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించార‌ని తెలుస్తోంది. ఇక జ‌గ‌న్ పులివెందుల‌లో ప్ర‌యాణిస్తే బ‌స్సుయాత్ర ఇక్క‌డ ఉండ‌ద‌ని తెలుస్తోంది. ఎందుకంటే 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర‌లో ట‌చ్ అవ్వ‌ని ప్రాంతాల‌కు జ‌గ‌న్ బ‌స్సు యాత్ర చేయ‌నున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.