ఫిరాయింపు ఎమ్మెల్యే పై జ‌గ‌న్ కొత్త స్కెచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-19 13:48:07

ఫిరాయింపు ఎమ్మెల్యే పై జ‌గ‌న్ కొత్త స్కెచ్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన గుర్తుపై గెలిచి ఆ పార్టీ గుర్తు పై జెండాతో ప్ర‌చారం చేసి గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది అధికార పార్టీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే... ఎన్ని సార్లు ఈ విష‌యంలో వారు రాజీనామా చేసి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో నిరూపించుకుని త‌ర్వాత పోటీ చేయాలి అని చెప్పినా, ఏనాడు అధికార పార్టీ నుంచి దీనిపై ఎటువంటి స్పందన రాలేదు..అదే విధంగా అధికార పార్టీ  జ‌గ‌న్ పార్టీలో నుంచి త‌మ పార్టీలోకి  వ‌ల‌స‌ల‌కు కొత్త కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు.. మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీ ఆఫ‌ర్లు పెరిగాయి వైసీపీ నాయ‌కుల‌పై.
 
ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి  రంప‌చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ పార్టీత‌ర‌పున, 2014 ఎన్నిక‌ల్లో  వంత‌ల రాజేశ్వ‌రికి టెకెట్ ఇచ్చి గెలిపించుకున్నారు... దీంతో వైసీపీకి జిల్లాలో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మంచిప‌ట్టు ఉన్న నేత‌గా ఆమె ఎదిగారు... ఇక పార్టీ త‌ర‌పున కీల‌కంగా ఆమె ఉన్నా, త‌ర్వాత ఆమె పార్టీ ఫిరాయించారు...ఇక పార్టీ ఫిరాయింపులపై  జ‌గ‌న్ స‌వాళ్లు చేసినా  ఈ నాయ‌కులు ఆ స‌వాళ్ల పై స్పందించ‌లేదు.
 
ఇక వైసీపీ అధినేత రంప‌చోడ‌వ‌రంలో వైసీపీని బ‌లంగా చేసేందుకు ప్ర‌ణాళిక రంచించారు.. స్ధానిక కేడ‌ర్ నాయ‌కుల‌తో చ‌ర్చించి పార్టీ పై లోతుగా విశ్లేష‌ణ చేసి ఇక్క‌డ పార్టీకి వెన్నుద‌న్నుగా నిలిచేవారికి సీటు ఇవ్వాలి అని ఆలోచించారు. అందులో భాగంగా రంప‌చోడ‌వ‌రం వైసీపీ బాధ్య‌త‌లు నాగులప‌ల్లి ధ‌న‌ల‌క్ష్మికి అప్ప‌గించారు జ‌గ‌న్.. దీంతో పార్టీ త‌ర‌పున ఆమె ఇక్క‌డ వైసీపీకి స‌మ‌న్వ‌య‌కర్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.. ఇటు తెలుగుదేశం త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంత‌ల రాజేశ్వ‌రికి సీటు వ‌స్తుందా, పాత అభ్య‌ర్దికే సీటు ఇస్తారా అనేది డైల‌మాగా ఉంది.. దీంతో వైసీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్ది దొరికారు అని వైసీపీ కేడ‌ర్ ఆనందంలో ఉన్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.