సిక్కోలు పై జ‌గ‌న్ స్ట్రాట‌జీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-26 15:08:05

సిక్కోలు పై జ‌గ‌న్ స్ట్రాట‌జీ

నిజంగా వైసీపీ ఉత్త‌రాంధ్రాలో గ‌త ఎన్నిక‌ల్లో ఎంత ప్ర‌చారం చేసినా వైసీపీకి అనుకున్నంత విజ‌యం అయితే వ‌రించ‌లేదు..ఉత్త‌రాంధ్రాలో చివ‌రి ప్రాంతం శ్రీకాకుళంలో వైసీపీ ప‌ది స్ధానాల్లో మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు గెలుచుకుంది.అందులో ఒక‌రు పార్టీ ఫిరాయించారు.. ఇటు విజ‌య‌న‌గ‌రం విశాఖ అంతా తెలుగుదేశం 70 శాతం విజ‌యం సాదించింది.. విశాఖ అంటే విద్యారంగానికి ఉద్యోగాల‌కు నార్త్ సైడ్ సెటిల‌ర్స్ ఎక్కువ.. దీంతో ఇక్క‌డ విశాఖ‌లో బీజేపీ వేవ్స్ టీడీపీకి ఉప‌యోగ‌ప‌డితే, ఇటు విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ వేవ్స్ బీజేపీ పొత్తుతో సైకిల్ పార్టీకి ప్ల‌స్ అయ్యాయి.
 
2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున శ్రీకాకుళం జిల్లాలో విజ‌యం సాధించారు.. రాజాం ఎమ్మెల్యేకంబాల జోగులు, ఇటు పాల‌కొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి.. ఇక పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే క‌ల‌మ‌ట వెంక‌ట‌ర‌మ‌ణ‌....కాని క‌ల‌మ‌ట‌ పార్టీ మారి అప్పుడే రెండు సంవ‌త్స‌రాలు అవుతోంది.ఆయ‌న బాబు అభివృద్ది చూసి పార్టీ ఫిరాయించారు తెలుగుదేశంలోకి..
 
ఇటు ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు వ‌ద్దాన్ని ప‌క్క‌న మూడు సెగ్మెంట్ల టీడీపీ నాయ‌కులు వ‌ద్ద‌న్నా, పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి మ‌ళ్లీ పార్టీలోకి వ‌చ్చే వారిని సీఎం ఎందుకు ఎంక‌రేజ్ చేస్తున్నారు అని కొంద‌రి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చినా, మ‌ళ్లీ సొంత గూటికి క‌ల‌మ‌ట‌కు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. 
 
ఇక్క‌డ రాజ‌కీయంగా ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఎంతో విభేదించినా చంద్ర‌బాబు మాత్రం వెంక‌ట ర‌మ‌ణ‌కు సీటు ఇచ్చారు. అయితే త‌ర్వాత సెగ్మెంట్లో అనేక రాజ‌కీయాలు జ‌రిగాయి.. ముఖ్యంగా టీడీపీ వార్ ఎలా ఉన్నా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రావ‌డంతో అసమ్మతి మ‌రింత పెరిగింది శత్రుచర్ల వ‌ర్గం నుంచి.. త‌న ఓట‌మికి కార‌ణం అయిన వారితో తాను ఏ ప‌ద‌విలో లేకుండా కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రుకాను అని అన్నారు పాత‌ప‌ట్నం టీడీపీ నాయ‌కుడు రాజుగారు..
 
అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య ఆ స‌మ‌యంలో అస‌మ్మ‌తి త‌గ్గించేందుకు సీఎం చంద్ర‌బాబు నెల్లూరు నుంచి  వాకాటి నారాయణరెడ్డి, అనంతపురం జేసి ఫ్యామిలీ వారి అల్లుడు దీపక్ రెడ్డి, తూర్పుగోదావరి చిక్కాలకు ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చారు.. అందులో భాగంగా శత్రుచర్లకు ఎమ్మెల్సీ ఇచ్చారు సిక్కోలు నుంచి.. అయితే ఇక్క‌డ జ‌గ‌న్ కు విప‌రీత‌మైన ప్ర‌చారం చేయ‌కుండానే ఇప్పుడు మ‌రింత పార్టీకి ప్ల‌స్ అయింది.
 
కుమ్మ‌క్కు రాజ‌కీయాలు సెగ్మెంట్ల‌లో అసమ్మ‌త్తి పెరిగిపోవ‌డంతో, జ‌గ‌న్ కూడా వైసీపీ నాయ‌కులకు ఎటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోవద్దిని, జిల్లాలో మాజీ మంత్రి కాంగ్రెస్ లో చ‌క్రం తిప్పిన ఇద్ద‌రు, పార్టీలోకి వారే వ‌స్తారు అని ధీమాగా ఉన్నారు...చివ‌ర‌కు వారే జ‌గ‌న్ త‌లుపు త‌ట్టారు..ఇటు ఫిరాయింపు సెగ్మెంట్లో కూడా బ‌ల‌మైన కేడ‌ర్ జ‌గ‌న్ కు ఏర్ప‌డింది. ఒక్కోచోట శాంతంగా ఉన్నా ప‌రిస్దితి మ‌న‌కు అనుకూలంగా మారుతుంది అన‌డానికి జ‌గ‌న్ ఇక్క‌డ సిక్కోలు స్ట్రాట‌జీ  ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.