టీడీపీ ఓటు బ్యాంకుకు భారీ గండి.. జగనా.. మజాకా..

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy
Updated:  2018-10-13 03:01:22

టీడీపీ ఓటు బ్యాంకుకు భారీ గండి.. జగనా.. మజాకా..

వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయోగం పార్టీకి మేలు చేస్తుంది ఇది శుభ పరిణామమే అని పార్టీలోని సీనియర్లు అంటున్నారు.  గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీకి అనుంగు అనుచరుడుగా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. ఈయన వైసీపీ ప్రారంభం నుంచి కూడా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఈయన చాలానే ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ టికెట్ సంపాయించుకుని గెలిచి తీరాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే గడిచిన నాలుగున్నరేళ్లుగా కూడా ఆయన నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు.ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతూ.. పార్టీ నేతలలో అసంతృప్తి అనేది లేకుండా చూసుకుంటున్నారు. అయితే ఇక్కడ సడెన్‌గా జగన్ అభ్యర్థిని మార్చారు. ఈ మార్పుతో నియోజకవర్గంలో ఒక్కసారిగా కలకలం రేగింది. వచ్చే ఎన్నికలు అత్యంత క్లిష్టంగాను, ఇంపార్టెంట్‌గాను మారడంతో ఈ నియోజకవర్గం నుంచి సామాజిక సమీకరణలు, ఇతరత్రా పరంగా మరింత బలమైన వ్యక్తిని రంగంలోకి దింపాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు..

ఈ క్రమంలోనే అప్పిరెడ్డిని తప్పించి, విశ్రాంత పోలీస్ అధికారి చంద్రగిరి ఏసురత్నంను సమన్వయకర్తగా నియమించారు. అయితే, ఈ మార్పుపై తొలుత ఇక్కడ ఆందోళన, ఆవేదన వ్యక్తమైనా.. ఇప్పుడు మాత్రం జగన్ చేసిన మార్పును ప్రతి ఒక్కరూ స్వాగతిస్తుండడం గమనార్హం.ఈ క్రమంలో అసలు మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది? జగన్ చేసిన మ్యాజిక్ ఏంటి? ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? అనే విషయాలపై వైసీపీలోను, ప్రధ