జ‌గ‌న్ అందులో దిట్టా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-14 16:26:09

జ‌గ‌న్ అందులో దిట్టా

రాష్ట్రంలో ఎవ్వ‌రు బ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేదు, నేను మీ కుటుంబంలో ఒక్కడినై పోరాడుతా, మీ క‌ష్టాల‌కు నేనే బాధ్య‌త వ‌హిస్తాను, మ‌రికొన్ని రోజుల్లో మ‌నంద‌రి ప్ర‌భుత్వం రాగానే ప్ర‌తీ ఒక్కరి ముఖంలో చిరున‌వ్వు చూస్తానని ప్ర‌జ‌ల‌కు కొండంత భ‌రోసా ఇస్తూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాంగంగా ముందుకు సాగుతున్నారు.  
 
ఇక ఆయ‌న చూపిస్తున్న ప్రేమ‌ను చూసి ప్ర‌జ‌లు ఎంతో సంతోషిస్తున్నారు. గతంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర్వాత త‌మను ఇంత ఆప్యాయంగా ప‌లుక‌రిస్తున్న రాజ‌కీయ నాయ‌కుడు కేవ‌లం ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే అని త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు జ‌గ‌న్ వారి స‌మ‌స్య‌ల‌ను ఎంతో ఓపిక‌గా వింటూ వృద్యాప్యంలో ఉన్న వారిని ప్ర‌త్యేకంగా పిలిపించుకుని వారికి భ‌రోసా ఇస్తున్న తీరుకు రోజురోజుకు ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌కు ఇసుక వేస్తే రాలనంత జ‌నం హాజ‌రు అవుతున్నారు.
 
అయితే ప్ర‌స్తుతం ఈ సంకల్ప‌యాత్ర 2014లో టీడీపీకి కంచుకోట‌గా మారిన తూర్పుగోదావరి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ రోజు ఉద‌యం 7.30 నిమిషాల‌కు ప్రారంభ‌మైన ఈ జ‌న‌నేత పాద‌యాత్ర బిక్కవోలు, గొల్లల మామిడాడ వరకూ సాగనుంది. ఆ త‌ర్వాత గొల్లల మామిడాడలో వైసీపీ నాయ‌కులు ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంరంగ స‌భ‌లో పాల్గొంటారు. ఇక ఈ స‌భ‌లో అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.