జ‌గ‌న్ అదిరిపోయే ప్లాన్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-19 13:49:35

జ‌గ‌న్ అదిరిపోయే ప్లాన్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తు ప‌లు సంచ‌ల‌న అంశాల‌ను తెర‌పైకి తీసుకువ‌చ్చారు.. ప‌లు హామీల‌ను ఇస్తూ ప్ర‌జ‌ల‌కు అనేక కులాల సంఘాల‌కు కార్పొరేష‌న్లు ప్ర‌క‌టిస్తూ ముందుకు న‌డిచారు..అయితే రాజ‌కీయంగా కూడా జ‌గ‌న్ ప‌లు కీల‌క హామీలు ఇచ్చారు.. నాయ‌కుల‌కు ప‌ద‌వుల పై కూడా క్లారిటీ ఇచ్చారు వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి..
 
ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యాలు ఇటు పార్టీలో ఎంతో మందికి ఆనంద వెల్లివిరిసేలా చేశాయి.. ముఖ్యంగా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం బాధ్య‌త‌లు చూస్తున్న క‌వురు శ్రీనివాస్ కు జ‌గన్ ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాను అని ప్ర‌క‌టించారు.
 
అలాగే ఎమ్మెల్సీ ప‌ద‌వి హామీతో పాటు ఆయ‌న‌కు రాజ‌మండ్రి పార్ల‌మెంట్ జిల్లా పార్టీ అధ్య‌క్షులుగా ఇటీవ‌ల జ‌గ‌న్ నియ‌మించారు.. అయితే బీసీల‌కు జ‌గ‌న్ రాజ‌మండ్రి పార్ల‌మెంట్ సీటు ఇస్తాను అని ప్ర‌క‌టించ‌డం, ఇప్పుడు క‌వురుకు ఇక్క‌డ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో జ‌గ‌న్ ఇక్క‌డ స్పీడును పెంచారు అనేది తెలుస్తోంది.. ఇక ముఖ్యంగా రాజ‌మండ్రి బీసీలు ఎక్కువ ఉండే ప్రాంతం, ఇక ఆర్ధికంగా బ‌ల‌మైన నాయ‌కులు ఉన్న సెగ్మెంట్.
 
ఇక తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజ‌మండ్రి ఆర్ధిక రాజ‌ధానిగా చెప్పుకోవాలి... ఇవ‌న్నీ రాజ‌మండ్రిని ఆ రేంజ్ కు తీసుకువెళ్లాయి.. ఇప్పుడు క‌వురుకు సీటు ఇచ్చి జ‌గ‌న్ మ‌రో కీల‌క స్టెప్ తీసుకున్నారు అనేది తెలిసేలా చేశారు.. ముఖ్యంగా వైసీపీ అధినేత కీల‌క ప్ర‌క‌ట‌న వెనుక ఇక్క‌డ వ‌ర్గ‌పోరు లేకుండా చేయడం కూడాజ‌రిగింది... సో కీల‌క స్టెప్ తీసుకోవ‌డంతో వైసీపీ నేత‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

షేర్ :

Comments

1 Comment

  1. Yes Correct

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.