చంద్ర‌బాబుపై జ‌గ‌న్ సూప‌ర్ డైలాగ్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 18:31:11

చంద్ర‌బాబుపై జ‌గ‌న్ సూప‌ర్ డైలాగ్స్

2014లో అధికారంలోకి వ‌చ్చిన  తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌ల‌పై దాడులు చేస్తున్నార‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. 2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేప్ప‌టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా వైసీపీ నాయ‌కులు రాయ‌వ‌రంలో ఏర్పాటు చేసిన భ‌రీ భ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ, మ‌రోసారి ముఖ్మ‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అలాగే టీడీపీ ఎమ్మెల్యేల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
 
చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత విచ్చ‌ల‌విడిగా ఇసుక మాఫియా చేస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. 2014 నుంచి టీడీపీ నాయ‌కులు ఇసుక ఫ్రీ అని చెప్పి విచ్చ‌ల‌విడిగా రాష్ట్రంలో ఉన్న ఇసుకును ఇత‌ర రాష్ట్రాల‌కు లారీలు లారీలు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్నార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ఈ స్కామ్ కేవలం టీడీపీ నాయ‌కులు బాగుప‌డ‌టం కోసం ఇసుకు ఫ్రీ అని చెప్పార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.
 
అలాగే టీడీపీ నాయ‌కులు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎస్సీ, ఎస్టీ కేసులు అదే కుల‌స్తుల‌కు చెందిన వారిపై పెట్టించిన ఘ‌న‌త టీడీపీ నాయ‌కులు ద‌క్కించుకున్న‌ర‌ని జ‌గ‌న్ ఆరోపించారు. అలాగే నాలుగు సంవ‌త్ప‌రాలుగా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు నాయుడు మ‌హిళ‌లు బ్యాంకుల్లో కుద‌పెట్టిన న‌గ‌లను తాను తీసుకువ‌స్తాన‌ని చెప్పి ఇంత‌వ‌ర‌కు తీసుకురాలేద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.