జ‌గ‌న్ అదిరిపోయో స్కెచ్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-25 14:17:49

జ‌గ‌న్ అదిరిపోయో స్కెచ్

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టీడీపీలోకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేస్తున్నారా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ముఖ్యంగా క‌ర్నూల్ జిల్లాలో టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పై ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని జిల్లాల‌తో పోలిస్తే క‌ర్నూల్ జిల్లా నుంచి ఎక్కువ‌గా టీడీపీలోకి ఫిరాయించారు. 
 
ఇక 2019 ఎన్నిక‌ల్లో ఫిరాయించిన వారిని ఎలాగైనా ఓడించాల‌నే ఉద్దేశ్యంతో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్యూహాలు ర‌చిస్తున్నారు. అయితే ఇప్ప‌టికే  ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ తో క‌ర్నూల్ జిల్లా వ్యాప్తంగా స‌ర్వే నిర్వ‌హించారు. ఈ స‌ర్వేలో టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను, అలాగే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జాధ‌ర‌ణ ఉన్న అభ్య‌ర్థిని ఎంపిక చేసేందుకు పీకే టీమ్ వ్యూహాలు ర‌చిస్తున్నారు.
 
ముఖ్యంగా క‌ర్నూల్ జిల్లా అర్భ‌న్ లో పీకే టీమ్ ఎక్క‌వ‌గా ఫోక‌స్ చేస్తోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. 2009లో ఎస్వీ మోహ‌న్ రెడ్డి కాంగ్రెస్ త‌ర‌పున పాటీ చేసి త‌న ప్ర‌త్య‌ర్థి కేఈ ప్ర‌భాక‌ర్ పై ఘోర ప‌రాజ‌యం ఎదుర్కున్నారు. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న త‌ర్వాత 2014 లో ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రాజ‌కీయ జీవితం పొందిన ఎస్వీ మోహ‌న్ రెడ్డి అధికార ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. 
 
ఇక ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్వీ మోహ‌న్ రెడ్డిని రాజ‌కీయంగా దెబ్బ కొట్టాల‌నే ఉద్దేశ్యంతో వైఎస్ జ‌గ‌న్ ఈ సెగ్మెంట్ పై ఎక్కువ ఫోక‌స్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చూడాలి మ‌రి రానున్న రోజుల్లో ఈ జిల్లాలో  రాజ‌కీయాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయో అన్న‌ది ఆస‌క్తి క‌రంగా మారుతోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.