నాది అల‌వాటైన ప్రాణం వైయ‌స్ జ‌గ‌న్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-11 17:48:06

నాది అల‌వాటైన ప్రాణం వైయ‌స్ జ‌గ‌న్ ?

ప్ర‌త్యేక హూదా కోసం ఏపీ లో ప్ర‌జ‌లు అంద‌రూ క‌లిసి కట్టుగా పోరాడాల‌ని ప్ర‌త్యేక హూదా కేంద్రం నుంచి సాధించుకోవాల‌ని వారు కోరుతున్నారు.. ఇక దిల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో దీక్ష కొన‌సాగిస్తున్న ఇద్ద‌రు వైసీపీ ఎంపీల‌తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు.. మీరు చేస్తున్న దీక్ష రాష్ట్రం గ‌ర్వ‌ప‌డేలా ఉంది అని తెలియ‌చేశారు..  వైసీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి ఆయ‌న మ‌ద్ద‌తు తెలిపారు.                      
 
వైసీపీ అధినేత జ‌గ‌న్  స్కైప్‌ ద్వారా  ఎంపీల‌తో మాట్లాడారు.  ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎంపీల పోరాటాన్ని ప్రజలు జీవితంలో మరచిపోలేరని ఈ సందర్భంగా ఆయన తెలియ‌చేశారు. ఎంపీలు చూపిన నిబద్ధత, అంకిత భావానికి అభినందనలు తెలియజేస్తూ ఆరోగ్యం జాగ్రత్త అంటూ సూచించారు ఎంపీల‌కు వైయ‌స్ జ‌గ‌న్.
 
ఇక పోరాటాల ద్వారానే కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలి అని వైసీపీ ఉద్దేశం అని అన్నారు..రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై మీరు పలు మార్లు ఆమరణ దీక్షలు చేశారని, అది ఎంత కష్టసాధ్యమో ఇప్పుడు మాకు తెలుస్తోందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మిథున్‌ రెడ్డి అన్నారు.... దీనికి స్పందిస్తూ తనది అలవాటైన ప్రాణమని జగన్‌ సమాధానమిచ్చారు. నీళ్లు బాగా తాగి డీ హైడ్రేషన్‌ కాకుండా చూసుకోవాలని ఎంపీలకు సూచించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.