జ‌గ‌న్ కి ఛాన్స్ ఇస్తున్న చంద్ర‌బాబు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

chandrababu and jagan
Updated:  2018-06-25 12:21:42

జ‌గ‌న్ కి ఛాన్స్ ఇస్తున్న చంద్ర‌బాబు

ష‌డ్రుచుల ఉగాది పచ్చ‌డిలా ఉంది ఏపీ రాజ‌కీయం.. అన్నీ పార్టీల్లో లుక‌లుక‌లు, అస‌హనాలు ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా అధికార పార్టీలో ఈ జోరు మ‌రింత ఎక్కువ‌గా ఉంది... ఇక ఎవ‌రైనా అధికార పార్టీ వారు ప్ర‌తిప‌క్షానికి ఒక్క అంశంలో కూడా దొరక్కూండా జాగ్రత్త ప‌డ‌తారు.. కాని ఇక్క‌డ తెలుగుదేశం ఎలాంటి రాజ‌కీయం చేస్తున్నా ప్ర‌తిప‌క్ష వైసీపీకి స‌ర్వం తెలుస్తోంది. ప్ర‌తీ లూప్ హోల్ ని కెలికి మ‌రీ బ‌య‌ట‌పెడుతోంది వైసీపీ.
 
ఎవ‌రి పై విమ‌ర్శ‌లు చేయకుండా సానుకూలంగా స్పందిచి, నిర్ణ‌యం చ‌ర్చించి తీసుకుంటామ‌ని చెప్పాల్సిన  సీఎం, ఇటీవ‌ల నాయి బ్రాహ్మ‌ణుల విష‌యంలో ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక జ‌గ‌న్ ఈ విష‌యం పై చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌లుచేశారు.. ఇక ప్ర‌త్యేక హోదా డిమాండ్ విష‌యంలో వైసీపీ ఎంపీలు ఐదుగురు రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించుకోమ‌నండి అని స‌వాల్ చేశారు.. చివ‌ర‌కు జ‌గ‌న్ ఈ స‌వాల్ ను స్వీక‌రించి రాజీనామాలు ఆమోదించేలా చేశారు..
 
ఇటు రాయ‌ల‌సీమ‌కు అటు విశాఖ‌కు రైల్వే జోన్ విష‌యంలో జ‌గ‌న్, బాబు ఇద్ద‌రూ కూడా తొంద‌ర ప‌డి మాట్లాడ‌టం లేదు.ఇప్పుడు క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం తెలుగుదేశం నాయ‌కులు ముఖ్యంగా ఎంపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష చేస్తున్నారు..నాలుగేళ్లు చంద్ర‌బాబు స‌ర్కారు ఉక్కు ప‌రిశ్ర‌మ‌పై సైలెంట్ గా ఉండి ఒక్క‌సారిగా త‌న పందా చూపింది. ఇది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. ఇక ప్ర‌త్యేక హోదా సంజీవ‌నా అని సీఎం చంద్ర‌బాబు గతంలో అన్న విష‌యం తెలిసిందే.. అలాగే ప్ర‌త్యేక హోదా వ‌చ్చిన రాష్ట్రాల్లో ఉద్యోగాలు వ‌చ్చాయా అని ప్ర‌శ్నించిన మంత్రి లోకేష్ కు, ఇప్పుడు ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం యూట‌ర్న్ పై ఎటువంటి  స‌మాధానాలు చెప్పాలి అన్నా త‌ర్జ‌న భ‌ర్జ‌న గా ఉంది.
 
ఇటు జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నారు.. అదే అంశాన్ని జ‌గ‌న్ కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తున్నారు.. మ‌రీ ముఖ్యంగా జాబు వ‌చ్చింది లేదు బాబు వ‌చ్చాక జాబులు పోయాయి అని ఇటు నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతిపై కూడా జ‌గ‌న్ నిరంత‌రం ప్ర‌శ్నిస్తూనే ఉంటున్నారు. ప్ర‌తీ విష‌యంలో జ‌గ‌న్ కు చంద్ర‌బాబు ఛాన్స్ ఇస్తున్నారు.. ఇటు రిలాక్స్ గా అధికార పార్టీ చేసే వాటిని జ‌గ‌న్ పాయింట్ టూ పాయింట్ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.. రాజ‌కీయ విమ‌ర్శ‌ల ఆయ‌దాలు ఇవ్వ‌డంలో చంద్ర‌బాబు సీనియ‌ర్ అయితే, ఆ రాజ‌కీయ విమ‌ర్శ‌ల  ఆయుదాలు ఉపయోగించుకోవ‌డంలో జ‌గ‌న్ బాబుకంటే సీనియ‌ర్ లా మారారు అని విశ్లేష‌కులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.