మోడీకి జ‌గ‌న్ ఎన్ని మార్కులు వేశారో తెలిస్తే షాక్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-18 13:53:06

మోడీకి జ‌గ‌న్ ఎన్ని మార్కులు వేశారో తెలిస్తే షాక్

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019లో అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ఎండా, గాలి, వాన ఇవి ఏవి ప‌ట్టించుకోకుండా ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర చేస్తున్న‌ సంగతి తెలిసిందే.. 2017 నవంబ‌ర్ 6 వైఎస్సార్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి చేప‌ట్టిన ఈ పాద‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం టీడీపీ కంచుకోట తూర్పు గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది.
 
ఈ పాద‌యాత్ర‌లో జ‌గన్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి, అరాచ‌కాల‌ను వివ‌రిస్తూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
అయితే తాజాగా ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా ఓ ప్ర‌ముఖ మీడియా ఛాన‌ల్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంట‌ర్వ్యూ తీసుకుంది. ఈ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ ను మీడియా ప్ర‌తినిధి ప్ర‌ధాని మోడీకి ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఎన్ని మార్కులు వేస్తార‌ని ఆయ‌న అడుగ‌గా అందుగు జ‌గ‌న్ స‌మాధానం ఇస్తూ తాను ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో సున్నా మార్కులు వేస్తాన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. 2014లో తిరుమ‌ల‌ వెంక‌న్న సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌లేద‌ని జ‌గన్ ఆరోపించారు. 
 
అంతేకాదు ఈ విష‌యాన్ని బీజేపీ మ్యానిఫెస్టోలో కూడా పెట్టింది. కానీ ఏపీకి ప్ర‌త్యేకహోదా కేటాయించ‌లేదు. అందుకే తాను మోడీకి సున్నా మార్కులు వేస్తానని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. అలాగే ప్రత్యేక హోదా ఇస్తే ఎవ్వరికైనా మద్దతు ఇస్తారా అని మీడియా అడుగ‌గా, దానికి జ‌గ‌న్ బ‌దులిస్తూ ఏపీకి ప్ర‌త్యేక హోదా కేటాయిస్తామ‌ని ఏ పార్టీ అయితే సంత‌కం చేస్తుందో ఆ పార్టీకి తాము మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.
 
చివ‌ర‌కు కాంగ్రెస్ పార్టీకి అయినా తాము మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం తాను ఎవ్వ‌రికి అయినా మ‌ద్ద‌తు తెలిపేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు. అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అను నేను అని ప్ర‌మాణ‌ స్వీకారం చేస్తారా అని మీడియా అడుగ‌గా, అందుకు జ‌గ‌న్‌ స‌మాధానం ఇస్తూ ప్ర‌జ‌ల ఆశీస్సులు, దేవుడిద‌య ఉంటే ఖ‌చ్చితంగా అది జ‌రుగుతుందని స్ప‌ష్టం చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.