ప‌వ‌న్ విష‌యంలో జ‌గ‌న్ చెప్పింది క‌రెక్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-23 15:55:17

ప‌వ‌న్ విష‌యంలో జ‌గ‌న్ చెప్పింది క‌రెక్ట్

మ‌న సినిమా వాళ్లు నేటివిటీకి త‌గ్గా సినిమా చేయాలి అని అనుకుంటారు.. త‌మిళ్ సినిమాల‌కు మ‌ళ‌యాల సినిమాల‌కు తెలుగు సినిమాల‌కు చాలా డిఫ‌రెన్స్ ఉంటుంది.. అలాగే రాజ‌కీయాల్లో కూడా చాలా డిఫ‌రెన్స్ ఉంటుంది.. సౌత్ లో ఎక్కువ‌గా కేర‌ళ వారు అంటే బాగా ఎడ్యుకేటెడ్ అంటారు.త‌మిళ‌నాడులో కూడా విలేజ్ రాజకీయాల కంటే తెగల రాజ‌కీయాలు ఎక్కువ న‌డుస్తాయి.ఇక తెలుగు రాష్ట్రాల్లో క‌ర్నాట‌కాలో పార్టీల‌కు చేసే సేవ, నాయ‌కుల‌కు చేసే సేవ, దేవునికి కూడా చేయ‌రు. స‌ర్వం నాయ‌కుల‌కు అర్పిస్తారు పార్టీల‌కు స‌మ‌ర్పిస్తారు.
 
ఇక గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో సౌత్ లో ఏ సినీ స్టార్ పార్టీ పెట్టినా,  పెద్ద స‌క్సస్  కాలేదు.. విజ‌య‌కాంత్ చిరంజీవి, త‌ర్వాత ప‌వ‌న్, క‌మ‌ల్ ఇప్పుడు త‌లైవా.. అయితే రాజ‌కీయాల‌కు సినిమాల ప‌రిశ్ర‌మ‌కు అవినాభావ సంబంధం ఉంది.. ఇప్పుడు కూడా అదే చర్చ నిరంత‌రం జ‌రుగుతూ ఉంది..ముఖ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయంగా ప‌రిణితి చెందారా అంటే సో కాస్త ఆలోచించాల్సిందే..
 
ఆయ‌న మాట‌లు ఆయ‌న ప్ర‌సంగాలు వింటే గ‌ట్టి పోటిని ఇచ్చేలా ఆయ‌న మాత్ర‌మే క‌న‌ప‌డుతున్నారు.. ఎందుకు అంటే ఆయ‌న కేడ‌ర్ మాత్రం ఇంకా లైన్ లోనే ఉంది.. మిగిలిన పార్టీల కేడ‌ర్ బారీకేడ్లు తోసుకుపోయే లా ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉంది.. అయితే ప‌వ‌న్ ఈ పార్టీ నిర్మాణం పై కేడ‌ర్ ని పెంచుకోవ‌డం పై ఇంకా శ్ర‌ద్ద పెట్ట‌డం లేదు.
 
జ‌గ‌న్ పార్టీ పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మైలేజ్ సంపాదించాడు.. వైసీపీని ఒంటి చేత్తో  జ‌గ‌న్ న‌డిపించాడు. తండ్రి పేరు ముందు వాడుకున్నా ఇప్పుడు జ‌గ‌న్ పేరే ఎక్కువ వినిపిస్తోంది. అయితే ప‌వ‌న్ మాత్రం ఇంకా చాలా ఎద‌గాలి.. ఆ ప్ర‌సంగాల తీరు మార్చాలి, అరిచే ప్ర‌సంగాలు జోక్యంలేని వ్య‌క్తుల‌ను మ‌ధ్య‌లోకి తీసుకురావ‌డం అనేది ప‌వ‌న్ త‌గ్గిస్తే ఆయ‌న పార్టీకి మ‌రింత బాగుంటుంద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.
 
ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తుంటే ఈయ‌న పోరాట యాత్ర అని ఉత్త‌రాంధ్రాలో చేస్తున్నారు. ఇక్క‌డ విచిత్రం జ‌గ‌న్ తూర్పుగోదావ‌రి నుంచి ఉత్త‌రాంధ్రాలోకి అడుగుపెడుతున్నారు.. ఆయ‌న ఉత్త‌రాంధ్రా నుంచి ఎటువైపు అడుగుపెడ‌తారో చూడాలి...ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చంద్ర‌బాబు టార్గెట్ ..బాబు  ప్ర‌భుత్వం టార్గెట్ గా జ‌గ‌న్ ప్ర‌సంగాలు ఉంటాయి.. ఇటు పవ‌న్ త‌న ప్ర‌సంగ శైలి మార్చారు. ఆయ‌న కూడా ఇదే విధానంలో ముందుకు వెళుతున్నారు... ఇక ప‌వ‌న్ జ‌ర్నీపై గ‌తంలో జ‌గ‌న్ కూడా కామెంట్ చేశాడు. ప‌వ‌న్ సినిమా త‌క్కువ, ఇంట‌ర్వెల్ ఎక్కువ అని అలాగే ప‌వ‌న్ కూడా జ‌గ‌న్ చెప్పిన విధంగా ఫాలో అవుతున్నాడు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.