జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan tweet image
Updated:  2018-03-06 06:49:47

జ‌గ‌న్ ట్వీట్

దేశ‌రాజ‌ధానిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హూదా నినాదాన్ని వినిపించిన ప్ర‌తీ ఒక్క‌రికి వైయ‌స్సార్ సీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు.. హూదా పోరులో భాగంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ సోమ‌వారం దిల్లీలో  నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నాలో వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు కూడా పాలుపంచుకున్నారు.
 
హ‌స్తిన‌లో ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వాలి అనే త‌లంపుతో దిల్లీలో వివిధ‌పార్టీల నాయ‌కుల‌తో క‌లిసి వైసీపీ హూదా సాధ‌న కోసం ఆందోళ‌న చేప‌ట్టింది..దీనిపై వైయ‌స్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ ధ‌న్య‌వాదాలు తెలియ‌చేశారు.
 
ఢిల్లీ ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, సీపీఐ, సీపీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాధాలు. ప్రధాని మోదీగారు ఈ ఆందోళనలను పరిగణలోకి తీసుకుని, ఏపీ హక్కు ప్రత్యేక హోదా ప్రతిపత్తిని కల్పిస్తారనే నమ్మకముంది  అని జగన్‌ ట్వీట్‌ చేశారు.... తెలుగుదేశం మాత్రం వైసీపీ ప్ర‌వేశ పెట్టే అవిశ్వాస తీర్మానం  మీద కూడా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు..
 
దీంతో పార్టీ త‌ర‌పున ఎటువంటి నిర్ణ‌యం తెలుగుదేశం తీసుకుంటుందా అని ఆలోచిస్తోంది వైసీపీ. ఇటు ప్ర‌త్యేక హూదా పై కాంగ్రెస్ కూడా హ‌స్తిన బాట ప‌ట్టింది.. ఇటు తెలుగుదేశం ఎంపీలు మాత్రం ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇవ్వాలి అని పార్ల‌మెంట్ ద‌గ్గ‌ర ఫ్లకార్డుల‌తో డిమాండ్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.