మ‌రో అభ్య‌ర్ధికి టికెట్ క‌న్ఫామ్ చేసిన జ‌గ‌న్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan
Updated:  2018-08-27 06:19:36

మ‌రో అభ్య‌ర్ధికి టికెట్ క‌న్ఫామ్ చేసిన జ‌గ‌న్

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాలోని ఆరు జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు కంచుకోట‌గా నిలిచిన విశాఖ ప‌ట్నం జిల్లాలోని య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గంలో నిర్విరామంగా కొన‌స‌గాగుతోంది.
 
ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న‌న్. ఇక ఆయ‌న ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌కు ఆర్షితులై చాలా మంది వైసీపీ తీర్థం తీసుకున్నారు. అయితే ఇదే క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె మాధ‌వి కూడా వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ త‌న‌కు ఖ‌చ్చిత‌మైన హామీ ఇచ్చార‌ని ఆమె మీడియా ద్వారా స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం పాడేరు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి స్థానం ఖాలీగా ఉంద‌ని ఆ స్థానంలో త‌న‌ను నిల‌బెడ‌తాన‌ని జ‌గ‌న్ త‌న‌కు హామీ ఇచ్చార‌ని ఆమె తెలిపింది. అది కుద‌ర‌క‌పోతే అర‌కు అసెంబ్లీ స్థానాన్ని ఇస్తాన‌ని హామీ ఇచ్చార‌ని మాధ‌వి స్ప‌ష్టం చేశారు. 
 
ఆ త‌ర్వాత పాడేరు స‌మ‌న్వ‌య క‌ర్త భాగ్య‌ల‌క్ష్మీని అర‌కు పార్ల‌మెంటరీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య ప‌రీక్షిత్ రాజును జ‌గ‌న్ త‌న‌కు ప‌రిచ‌యం చేశార‌ని ఆమె తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపుకోసం ప్ర‌తీ ఒక్క‌రు కృషి చేయాల‌ని ఆయ‌న సుచించార‌ని మాధ‌వి స్ఫ‌ష్టం చేశారు. జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ముగిసిన త‌ర్వాత త‌న‌కు అసెంబ్లీ టికెట్ అయినా లేక పార్ల‌మెంట్ టికెట్ అయినా ప్ర‌క‌టిస్తార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.