ముదునూరికి జ‌గ‌న్ టికెట్ ఫైన‌ల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 16:08:44

ముదునూరికి జ‌గ‌న్ టికెట్ ఫైన‌ల్

న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బ‌లంగా ఉందా..? తెలుగుదేశం బ‌లంగా ఉందా అంటే జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో ఓ క్లారిటీ వ‌చ్చింది ఇక్క‌డ సెగ్మెంట్లో..ముఖ్యంగాజ‌గ‌న్ పాద‌యాత్ర‌కు న‌ర‌సాపురంలో విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ తెలుగుదేశం విజ‌యం వ‌రించగ‌ల‌దా..? ఇక్క‌డ టీడీపీ ప‌రిస్దితి ఎలా ఉంది అంటే తెలుగుదేశం డైల‌మాలో ఉన్న‌ట్లు ఇంట‌ర్న‌ల్ స‌ర్వేలు వెల్ల‌డిస్తున్నాయి.
 
ముఖ్యంగా న‌ర‌సాపురం  సెగ్మెంట్లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ చేసిన ఓ త‌ప్పిదం పార్టీకి మైన‌స్ అయింది.. వైసీపీ త‌ర‌పున ముదునూరి ప్ర‌సాద‌రాజుకు న‌ర‌సాపురం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వ‌లేదు 2014 ఎన్నిక‌ల్లో  ఆయ‌న‌కు ఆచంట సీటు కేటాయించార జ‌గ‌న్ చివ‌రి నిమిషంలో.. అయితే కొత్తప‌ల్లి సుబ్బారాయుడు క‌చ్చితంగా విజ‌యం సాధిస్తారు అనే ఉద్దేశ్యంతో ఆయ‌న‌కు న‌ర‌సాపురం సీటు ఇచ్చారు జ‌గ‌న్‌..కాని  న‌ర‌సాపురంలో  ఆయ‌న ఓట‌మిపాల‌య్యారు.. ఇటు ముదునూరి కూడా ఆచంట నుంచి పోటీ చేసి పితాని స‌త్య‌నారాయ‌ణ పై ఓట‌మి పాల‌య్యారు.
 
ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం ఇక్క‌డ పాద‌యాత్ర‌లో ముదునూరికి న‌ర‌సాపురం అసెంబ్లీ సీటు ఫిక్స్ చేశారు.. న‌ర‌సాపురం నుంచి ఆయ‌న ఎంపీగా పోటీచేస్తార‌ని , ఓ ఎన్నారై ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా  పోటి చేస్తారు అనికొద్దిరోజులుగా వార్త‌లు వ‌చ్చినా ఇక్క‌డ మాత్రం ముదునూరికి ఈ సారి టిక్కెట్టు ఇచ్చి తీరాల‌ని కోర‌డంతో జ‌గ‌న్ ఫైన‌ల్ చేశారు.. ఆయ‌న న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసే ఆలోచ‌నలో లేర‌ని తెలియ‌చేశారట‌.
 
మొత్తానికి న‌ర‌సాపురం వైసీపీలో సీటు ఫైన‌ల్ అయింది.. ఎంపీ సెగ్మెంట్ నుంచి పోటీ ఎవ‌రు అనేది ప‌క్క‌న పెడితే ఇప్పుడు పొలిటిక‌ల్ వార్ ఇక్క‌డ మ‌రింత పెరిగింది. జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో పుష్క‌రాల నుంచి ప్ర‌తీది పాయింట్ చేస్తూ బ‌హిరంగ స‌భ‌లో చ‌ర్చించారు దీంతో ప్ర‌జ‌లు కూడా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు.
 
ఇక తెలుగుదేశం న‌ర‌సాపురం ఎమ్మెల్యే బండారు మాధ‌వ‌నాయుడు రాజ‌కీయంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు తెచ్చుకోగ‌ల‌రా అనే ఆలోచ‌న వ‌స్తోంది.. ఇటు కాపు ఓటింగ్ బ‌లంగా ఉంటుంది.. ఇక్క‌డ ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం మొద‌టిసారి సీటు ఇచ్చింది.. అయితే ఇటు కొత్త‌ప‌ల్లి ఫ్యామిలీ కూడా  న‌ర‌సాపురం సీటును ఆశిస్తోంది.. చంద్ర‌బాబు కొత్త‌ప‌ల్లికి కాపు కార్పొరేష‌న్ ప‌ద‌వి ఇచ్చినా ఇక్క‌డ మాత్రం ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం టీడీపీ బ‌రిలో ఉంటారు అని తెలుగుదేశం నాయ‌కులు చెబుతున్నారు.
 
ఇటు ఇద్ద‌రిలో సీటు ఎవ‌రికా అని ఇక్క‌డ పార్టీలో నాయ‌కులు చ‌ర్చ‌లు జ‌రుపుకుంటుంటే, కేడ‌ర్ కూడా విడివిడిగా ఉంటోంది.. ప‌లుగ్రామాల్లో కొత్త‌ప‌ల్లి యువ‌త, బండారు యువ‌త అంటూ సంఘాలు ఉన్నాయి... వీరి కేడ‌ర్ లో వివాదాలు రాకుండా సీటు ఎవ‌రికి అనేది బాబు ఎన్నిక‌ల వ‌ర‌కూ చెప్ప‌రు.. దీంతో ఇక్క‌డ టీడీపీలో చివ‌రి వ‌ర‌కూ లుక‌లుక‌లు ఉంటాయి అనేది జిల్లా నాయ‌కుల వాద‌న‌.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.