ట్రాప్ లోకి దింపుతున్న ఇద్ద‌రు ఇంటిలిజెంట్లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysr congress party
Updated:  2018-04-28 19:41:10

ట్రాప్ లోకి దింపుతున్న ఇద్ద‌రు ఇంటిలిజెంట్లు

                                         వైసీపీ లో గుట్టు పెరుమాళ్ల‌కెరుక
 
వైసీపీలో జ‌గ‌న్ వెంట ఉంటూనే పార్టీలో అప‌రిప‌క్వ‌త స‌ల‌హాలు ఇస్తున్న నాయ‌కుల‌ను జ‌గ‌న్ ఇంకా గుర్తించ‌డం లేదా..? ఇక  వైసీపీ పుట్ట‌లో వేలు పెడుతున్నఈ నాయ‌కుల‌ను జ‌గ‌న్ ఇంకా ఎన్నాళ్ల వ‌ర‌కూ న‌మ్ముతూ ఉంటారు? ఇదే ఇప్పుడు పార్టీలో సీనియ‌ర్లు లోట‌స్ పాండ్ వేదిక‌గా చ‌ర్చించుకుంటున్న విష‌యం...పార్టీ ప్ర‌థమ అఫీషియ‌ల్ కేడ‌ర్ కు కూడా తెలియ‌ని  ఓ రాజ‌కీయ స‌ల‌హాదారు చేస్తున్నారు... 
 
జ‌గ‌న్ కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు అయిన ఆ వ్య‌క్తి..... నిరంత‌రం జ‌గ‌న్ వెన్నంటి ఉంటూ  రాజ‌కీయంగా ఎటువంటి పావులు క‌ద‌పాలి అనే స‌ల‌హాలు ఇస్తూ ఉంటాను అని బ‌య‌ట చెప్పుకుంటూ ఉంటాడు. అయితే 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా జ‌గ‌న్ కు ఇలాంటి స‌ల‌హాలే ఇచ్చి పార్టీని న‌ట్టేట ముంచాడు అని అంత‌ర్గ‌తంగా సీనియ‌ర్లు అనుకుంటారు.
 
జ‌గ‌న్ ఆయ‌న్ని అంత న‌మ్మితే ఆయ‌న మాత్రం జ‌గ‌న్ కు  అప‌రిప‌క్వ‌త స‌ల‌హాలు ఇస్తూ పార్టీకి చేటు చేస్తున్నాడు. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైసీపీలో ఎంట్రీ ఇవ్వ‌డానికి అన్ని ప్లాన్లు రెడీ చేసుకున్న స‌మ‌యంలో, ఆయ‌న‌కు ఎంపీ సీటు ఫిక్స్ చేశారు జ‌గ‌న్.. కాని ఆయ‌న‌కు పెద‌కూర‌పాడు ఎమ్మెల్యేగా నిల‌వాలి అని జ‌గ‌న్ కు అత్యంత స‌న్నిహితుడైన ఈ వ్య‌క్తి స‌ల‌హా ఇచ్చారు.. ఆయ‌న మ‌న‌సు మార్చాలి అని అనుకున్నారు. అయితే దీని వెనుక పెద్ద ప్లాన్ ఉంది అని తెలుస్తోంది. దీని వెనుక వైసీపీలో ఓ కుట్ర జ‌రుగుతోంది అనేది తాజాగా బ‌య‌ట‌ప‌డింది.
 
వైసీపీ ఒప్పందం ప్ర‌కారం క‌న్నాకి న‌ర‌సరాపు పేట ఎంపీ సీటు ఆఫ‌ర్ చేశారు, అయితే క‌న్నాకు కాకుండా ఆ సీటు 2014 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మిపాలైన ఓ వైసీపీ ఎంపీ అభ్య‌ర్ది కి  ఇవ్వాలి అని అనుకున్నాడు ఆ రాజ‌కీయ స‌ల‌హాదారు.... దీని కోసం కోట్ల రూపాయ‌ల డీల్ త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా లాభం చేకూర్చుకోవ‌డానికి  కూడా చేసుకున్నాడ‌ట.
 
గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన వ్య‌క్తికి  కేవ‌లం ఎన్నిక‌ల్లో 10 నుంచి 15  కోట్లరూపాయ‌లు  ఖ‌ర్చు చేసే స‌త్తా మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికి,  జ‌గ‌న్ కు త‌ప్పుడు స‌మాచారం ఇస్తూ... ఆయ‌న 50  కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌గ‌ల‌రు అని న‌మ్మించారు... మీడియాలో సినిమా వార్త‌లు రాసే స్దాయి నుంచి జ‌గ‌న్ కు అసిస్టెంట్ గా ఎదిగిన వ్య‌క్తి కూడా ఈ డీల్ లో ఉన్నార‌ట‌..
 
వీరిద్ద‌రూ క‌లిసి ఆ ఎంపీ అభ్య‌ర్దికి  సీటు ఇప్పిస్తామ‌ని కోట్ల రూపాయ‌ల డీల్ చేసుకున్నార‌ట‌.... అలాగే త‌మ‌కు ఇబ్బంది లేకుండా క‌న్నాను కూడా ఒప్పించి పెద‌కూర‌పాడు నుంచి మీరు ఎమ్మెల్యేగా  పోటీచేయండి  ఎంపీ సీటు క‌న్నా ఎమ్మెల్యేగా మీరు గెలిస్తే, మీకు కేబినెట్ లో బెర్త్ ఇప్పిస్తా అని హామీ ఇస్తున్నార‌ట‌.... ఇక జ‌ర్న‌లిస్ట్ స్దాయి నుంచి సాక్షిలో డైరెక్టర్ స్ధాయికి వెళ్లి, జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర అయిన వ్య‌క్తి ఈ ఎపిసోడ్ లో మొయిన్ రోల్ పోషిస్తున్నాడు.
 
అయితే ఇక్క‌డ కొస‌మెరుపు ఏమిటి అంటే, క‌న్నాతో మొద‌టి నుంచి స‌ఖ్య‌త‌గా ఉంటూ !!కాంగ్రెస్ నుంచి!! పనులు చ‌క్క‌బెట్టుకున్న ఈ వ్య‌క్తి , క‌న్నా ఎంపీ కావాలి అని కోరుకున్న కోరిక‌ను ఇతని స్వార్ధ పూరిత ఆలోచ‌న‌ల‌తో ప‌క్క‌దారి మ‌ళ్లించారు.... ఈ స‌మ‌యంలో  ఆయ‌న‌ను ఎమ్మెల్యేగా పెద‌కూర‌పాడు నుంచి పోటి చేయాలి అని తెలివిగా ఒప్పించారు..అంతా ఒకే అయిన త‌ర్వాత క‌న్నా చేరిక ఆగిపోవ‌డం వీరి డీల్స్ కు క‌న్నం ప‌డిన‌ట్టు అయింది.
 
ఇక న‌ర‌సరావు పేట ఎంపీ సీటును  ఓ శౌర్యం లేని వ్య‌క్తికి  ఇప్పించి క‌న్నా ఎంట్రీని వీరు అడ్డుకుందాము అని ప్లాన్ వేశారు.. అలాగే శౌర్యం లేని వ్య‌క్తి ఎమ్మెల్యేగా నిల‌బ‌డితే గెలిచే అవ‌కాశాలు లేవు, అందుకే క‌న్నాను ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా నిల‌బెట్టి క‌న్నా విజ‌యం చెందితే, క‌న్నా ఓట్ల‌ను ఎంపీకి మ‌ల‌చుకోవ‌చ్చు అని ఆ అభ్య‌ర్ది ఎంపీ సులువుగా అవుతారు అని వీరి డీల్..
 
!! మ‌రోబిగ్ డీల్ !!
జ‌ర్న‌లిస్టు స్ధాయి  నుంచి జ‌గ‌న్ కు కార్య‌ద‌ర్శిగా అయిన వ్య‌క్తి , మ‌రియు జ‌గ‌న్ ని రాజ‌కీయంగా పావులు క‌దిపించే వ్య‌క్తి క‌లిసి మ‌రో బిగ్ డీల్ చేసుకున్నారు ఓ బిజినెస్ ప‌ర్సెన్ తో....  ఆయ‌న ఎవ‌రంటే తెలుగు రాష్ట్రాల‌లో రియ‌ల్ ఎస్టేట్ కింగ్ గా ఆయ‌న్ని పిలుస్తారు..... అంద‌మైన ఊహ‌ల‌కు పొందికైన గృహాల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తారు ఆయ‌న‌... ఆ వ్య‌క్తి నుంచి మూడు కోట్ల రూపాయ‌లు ముడుపులు తీసుకోవ‌డానికి రెడీ అయ్యారు ఈ ఇద్ద‌రూ .. ఈ ముడుపులకు కార‌ణం ఆయ‌న‌కు గుంటూరు జిల్లాలో ఏదో ఓ చోట ఎమ్మెల్యే సీటు ఇప్పించ‌డానికి డీల్ కుదుర్చుకున్నారు.
 
ఇక విజ‌య‌సాయిరెడ్డి లాంటి వ్య‌క్తులు జ‌గన్ కు వెన్నంటి ఉండి... పాద‌యాత్ర‌లు చేస్తూ పార్టీ కోసం ముందుకు వెళుతుంటే, అలాంటి నాయ‌కుల‌ను ఆద‌ర్శంగా తీసుకుని  ముందుకు వెళ్లాల్సింది పోయి... ఇలాంటి  రాజ‌కీయాలు చేయ‌డం ప‌ట్ల పార్టీలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.
 

షేర్ :

Comments

3 Comment

  1. Okaru balasowry inkokaru evaro ardham kaledu sajjala ramakrishnareddy

    Td5 tdp na koduku

    Two members evaru sir

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.