జగన్ గెలిచాడు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-23 17:32:35

జగన్ గెలిచాడు

జగన్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని, నరరూప రాక్షసుడు అని, పరిటాల రవిని చంపించాడు అని అనుకూల మీడియా అదరగొట్టింది. నిజమేమో అన్నట్టు ప్రజలు కూడా చర్చించుకునేటట్టు చేశారు..అనుకూల మీడియా ఊదరగొట్టినట్టు జగన్ అంత ఫ్యాక్షనిస్ట్ అయితే తాతని చంపిన వాళ్ళను ఎందుకు చంపలేదు...దీనిని బట్టే తెలుసుకోవాలి జగన్ ఫ్యాక్షనిస్ట్ లేక ప్రజల కోసం పాటుపడుతున్న మంచి మనిషా అని...
 
లక్ష కోట్ల దేశ సంపదను మొత్తం ఊడ్చేశాడు, అసలు ఇంక భారతదేశంలో ఏం మిగల్లేదు అనే రేంజ్ లో అనుకూల మీడియాలో, పత్రికలలో వార్తలు వచ్చాయి. ఒక చానెల్ అయితే ఒక అడుగు ముందుకేసి జగన్ కి ఖైదీ డ్రస్ వేసి గ్రాఫిక్ వీడియో చేశారు. ఒకానొకదశలో జగన్ పేరు చెప్తే అంటరాని వాళ్ళలా చూసే స్థాయికి తీసుకువచ్చారు. జగన్ ఇంట్లో ఉండి చూసినట్టు పెద్దల్ని గౌరవించడు, మర్యాద తెలియదు అని ప్రచారం చేశారు. ఇంట్లో వందల గదులు, బార్లు అని ఒక వ్యక్తిని ఎంత నీచంగా ప్రొజెక్ట్ చేయాలో అంతగా చేశారు...
 
జగన్ పై చేసిన దానిలో సగం కూడా చేయకుండానే ఎన్టీఆర్ నుండి చిరంజీవి వరకు ఎందరో వ్యక్తుల్ని అనుకూల మీడియాను అడ్డుపెట్టుకొని అడ్డు తొలగించుకున్నారు. కానీ ఇన్ని చేసిన జగన్ భయపడలేదు, తొణక లేదు, నమ్మిన సిద్ధాంతాల్ని వదల్లేదు, ఎంత మంది దూరం అయినా, చివరకు సొంత వాళ్ళు దూరం అయినా, తన తండ్రి మోచేతి నీళ్లు తాగిన వాళ్లు కూడా విమర్శించినా, పరాభవించిన  సంయమనం కోల్పోలేదు అన్నింటిని చిరునవ్వుతోనే ఎదుర్కొన్నాడు...
 
ఇన్ని కష్టాలు వచ్చిన‌ ఎదురొడ్డి నిలిచాడు కాబట్టే నాయకుడిగా నిలబడ్డాడు, నాయకుడిగా ఎదిగాడు...తప్పుడు తెరలు ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయి.. 40 ఏళ్ల వయసులోనే 40 ఏళ్ల‌ అనుభవం కలిగిన నిప్పుకి చెమటలు పట్టిస్తున్నారు...జగన్ దైర్యం, తెగింపు అనితరసాద్యం, అనిర్వచనీయం.. మొండివాడు కాబట్టే జగన్ గెలిచి, అభిమానులను గెలిపించాడు

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.