జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan tweet
Updated:  2018-04-24 05:00:42

జ‌గ‌న్ సంచ‌ల‌న ట్వీట్

అంగ‌న్ వాడి వ‌ర్క‌ర్ల‌ స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే పరిష్క‌రించాలంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజ‌య‌న‌గ‌రంలో అంగ‌న్ వాడి  వ‌ర్క‌ర్లంద‌రూ  క‌లిసి  జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్‌ కార్యాలయాన్ని ముట్టడించి నిర‌స‌న‌లు తెలిపారు....
 
దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ ప్ర‌భుత్వ అధికారులు అంగ‌న్ వాడి వ‌ర్క‌ర్లను అడ్డుకున్నారు...  అధికారులు వారిని అడ్డుకోవ‌డంతో  అక్క‌డ ఉద్రిక్త‌త  వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.... ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌లు అని చూడ‌కుండా వారిపై లాటీ చార్జ్ ని ఉప‌యోగించారు పోలీసులు. దీనిపై అక్క‌డ తీవ్ర దుమారం లేగింది.
 
అయితే ఈ విష‌యంపై తాజాగా ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వెయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని, తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌పై సంచ‌ల‌న ట్వీట్ చేశారు...ఓ వైపు మహిళా సాధికారిత అని మాట్లాడుతూ... మరోవైపు మహిళలపై దాడి చేయడం అమానుషమని ఆయన అన్నారు. తెలంగాణలో అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు పెంచారని, ఏపీలో పెంచకపోవడం మీకు సిగ్గుగా లేదా? అంటూ వైఎస్‌ జగన్‌ ట్విటర్‌ వేదికగా చేసుకుని టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు జ‌గ‌న్.
!! జ‌గ‌న్ ట్వీట్ !!
@ysjagan
Strongly condemn brutal lathi charge on Anganwadi workers agitating for their rights at Vizianagram. @ncbn, you speak of women empowerment, yet you resort to oppressive measures against them. Aren't you ashamed of failing to provide them with enhanced wages, as done in Telangana?
 
ఇక తాజాగా వైయ‌స్. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్పయాత్ర కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం సెగ్మెంట్ లో నిర్విరామంగా కొన‌సాగుతోంది.... రానున్న ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్షంగా చేసుకుని సంక‌ల్ప‌యాత్ర‌లో న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.