జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy
Updated:  2018-04-16 15:57:21

జ‌గ‌న్ ట్వీట్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌థువా ఉన్నావ్ ఘ‌ట‌న‌పై స్పందించారు... ఇలాంటి దారుణాలు జ‌రుగ‌కూడ‌ద‌ని ఆ నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌లు ప‌డాలి అని అన్నారు.. వారికి క‌ఠిన శిక్ష‌లు వేస్తే అవే వారికి గుణ‌పాఠాలు అవుతాయి అని తెలియ‌చేశారు జ‌గ‌న్...అలాగే ఏపీలో భ‌ద్ర‌త మ‌హిళ‌ల‌కు లేద‌ని ఆయ‌న ఆవేద‌నపూరితంగా తెలియ‌చేశారు. తాజాగా ఆయ‌న మ‌హిళ‌ల‌పై చిన్నారుల‌పై జ‌రుగుతున్న దారుణాల పై ట్వీట్ పెట్టారు.
 
ఆడబిడ్డలను కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం విఫలం చెందామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కథువా, ఉన్నావ్‌లో చోటుచేసుకున్న ఘోరాలు మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలని ఆయ‌న అన్నారు..... రానున్న రోజుల్లో ఇలాంటి నేరాలు చేయాలన్న తలంపు కూడా ఏ ఒక్కరికీ రాని విధంగా నిందితులకు  కఠినంగా  శిక్షించాలని అభిప్రాయపడ్డారు.  ఆయన... ఆంధ్రప్రదేశ్‌లోనూ మహిళలకు భద్రత కరువైన విషయాన్ని గుర్తుచేశారు.
 
!! ఆయ‌న ట్వీట్ సారాంశం !!
మానవత్వం మంటగలిసిందనడానికి కథువా, ఉన్నావ్‌ ఘటనలకన్నా వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. ఆడపిల్లల్ని కాపాడుకోవడంలో ఒక దేశంగా మనం వైఫల్యం చెందాం. బాధకరమైన విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి అంతకు తీసిపోలేదు. గతేడాది అక్టోబర్‌ 17న వైజాగ్‌ రైల్వే కాలనీలో ఓ మహిళపై పట్టపగలే లైంగికదాడి జరిగింది. డిసెంబర్‌లో పెందుర్తిలో మరో దళిత మహిళను వివస్త్రను చేసి దాడిచేశారు. ఈ సారి నిందితులను అస్సలు విడిచిపెట్టొద్దు. ఏఒక్కరు కూడా ఇలాంటి నేరానికి పాల్పడాలన్న ఆలోచన రాకుండా భయం పుట్టేలా కఠిన శిక్షలు విధించాలి అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.