జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-01 14:19:33

జ‌గ‌న్ ట్వీట్

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రోసారి తన సోష‌ల్ మీడియా అకౌంట్ ను వేదిక‌గా చేసుకుని ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుపై అలాగే ప్ర‌ధానమంత్రి మోడీపై స్పందించారు... ఎన్నిక‌ల ప్ర‌చారంలో న‌రేంద్ర‌మోడీ, చంద్ర‌బాబు నాయుడు క‌లిసి తిరుప‌తి వెంక‌న్న సాక్షిగా ఏప్రిల్‌ 30, 2014న  బ‌హిరంగ స‌భ‌లో విభ‌జ‌న చ‌ట్టంలో పొంద‌ప‌రిచిన ప్ర‌త్యేక హోదాను క‌లిసి హామీ ఇచ్చార‌ని జ‌గ‌న్ ట్వీట్ట‌ర్ లో పేర్కొన్నారు.
 
అయితే మోడీ ఐదు సంవ‌త్స‌రాలు ఏపీకి ప్ర‌త్యేక హోదాను క‌ల్పిస్తామ‌ని చెబితే చంద్ర‌బాబు నాయుడు ఐదు సంవ‌త్స‌రాలు కాదు 15 సంవ‌త్స‌రాల పాటు ఏపీ కి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని ఆయ‌న కోరార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు..అయితే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక నాలుగేళ్లుగా హోదా అంశానికి అన్ని విధాలుగా పాతేశార‌ని వైఎస్ జ‌గ‌న్ త‌న ట్వీట్ట‌ర్ లో పేర్కొన్నారు.
 
మ‌రో ట్వీట్ట‌ర్ లో పేర్కొంటూ... ఇప్పుడు త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకుంటూ ప్ర‌జ‌ల నుంచి త‌ప్పించుకు తిరుగుతూ మ‌రో కొత్త డ్రామాకు తెర లేపార‌ని అన్నారు... వంచ‌న దీక్ష‌కు గుర్తుగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు వైజాగ్ లో నిర్వ‌హించిన వంచ‌న వ్య‌తిరేక దీక్షకు ప్ర‌జ‌ల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింద‌ని జ‌గ‌న్ తెలిపారు... అయితే రాష్ట్రాన్ని వంచన చేసిన చంద్ర‌బాబుకు ధ‌ర్మ‌పోరాటం స‌భ‌ను ఏర్పాటు చేసే అర్హ‌త ఎక్క‌డుంద‌ని జ‌గ‌న్ ట్వీట్ట‌ర్ లో పేర్కొన్నారు..
 
ఇక తాజాగా జ‌గ‌న్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నిర్విరామంగా కృష్ణా జిల్లాలో కొన‌సాగుతోంది... ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి  విశేష స్పంద‌న ల‌భిస్తోంది... ప్ర‌జా స‌మ‌స్య‌లను తెలుసుకుంటూ అధికార టీడీపీ నాయ‌కులు చేస్తున్న అక్రమాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
@ysjagan
On Apr 30,2014 in Tirupati, @narendramodi, @ncbn & their friends promised to grant SCS to AP.@ncbn,who sought SCS for 15yrs before elections,has done everything possible to scuttle the demand for past 4yrs. He is now indulging in theatrics to hide his failures & to deceive people
 
@ysjagan
To mark this historic betrayal, YSRCP organized Vanchana Vyatereka Deeksha in Vizag, which got enormous support from public. @ncbn, while you conduct your so-called 'meeting for justice' in Tirupati, do you have the integrity & moral courage to answer for your betrayal?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.