జ‌గ‌న్ ట్వీట్ కు ఫిదా అవుతున్న ప్ర‌జ‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-27 17:14:10

జ‌గ‌న్ ట్వీట్ కు ఫిదా అవుతున్న ప్ర‌జ‌లు

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్పయాత్ర మ‌రో మైలురాయిని అదిగ‌మించింది. నవంబ‌ర్ 6వ తేదిన‌ క‌డ‌ప‌జిల్లా ఇడుపుల‌పాయ‌లో చేప‌ట్టిన ఈ సంక‌ల్ప‌యాత్ర నేడు తూర్ప‌గోదావ‌రి జిల్లా అమ‌లాపురంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. 
 
ఇక ఈ జిల్లాలో జ‌గ‌న్ మ‌రో రికార్డ్ ను సృష్టించారు. ఎర్ర‌ని ఎండ‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ప్ర‌జాసేవే ల‌క్ష్యంగా చేసుకుని పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ పాద‌యాత్ర నేటితో 200 రోజ‌లు పూర్తి చేసుకున్నారు. ఇక ఈ శుభసంద‌ర్భంలో జ‌గ‌న్ త‌న సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ట్వీట్ చేశారు. తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర తొలిరోజునుంచి ప్ర‌జ‌ల ముఖాల్లో రాబోయే రేప‌టి ఆశ‌ల‌ను చూశాన‌ని అన్నారు. అంతేకాదు త‌న‌పై ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మ‌కం పెట్టుకున్నార‌ని వారి న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేయన‌ని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.
 jagan tweet
దివంగ‌త‌నేత మాజీ ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాష్ట్రంలో ఏవిధంగా ప‌రిపాల‌న చేశారో తాను కూడా తిరిగి ఏపీలో మ‌ళ్లీ అదే పాల‌న‌ను తీసుకువ‌చ్చి ప్ర‌తీ ఒక్క‌రిలో చిరున‌వ్వు చూడాల‌నేది త‌న సంక‌ల్ప‌మ‌ని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ ను చూసిన నెటీజ‌న్లు తాము కూడా త్వ‌ర‌లో రాజ‌న్న పాల‌న‌ను చూడాల‌ని ఎంతో ఆశ‌గా ఉంద‌ని రీ ట్వీట్ చేస్తున్నారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.