జగన్‌ ట్వీట్.....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-01 01:32:38

జగన్‌ ట్వీట్.....

వైసీపీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత, ప్ర‌జా మ‌నిషి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర పై తాజాగా ట్వీట్ పెట్టారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పై ఆయ‌న ఆనందం వ్య‌క్తం చేశారు.. ప్ర‌జ‌లు త‌న‌పై  ఎంతో మ‌ద్ద‌తు, ప్రేమ, ఆప్యాయ‌త చూపుతున్నారు అని.. ఇవ‌న్ని త‌న‌కు  ఎన్న‌టికి మ‌రిచిపోలేని అనుభూతులు అని జ‌గ‌న్ అన్నారు.
 
ప్రజాసంకల్పయాత్ర వంద రోజులు పూర్తి కావడంతో, రాజన్న రాజ్యం మళ్లీ తేవాలన్న దృఢ నిర్ణయం మరింత బలపడిందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఈరోజుతో నా పాదయాత్రకు వంద రోజులు పూర్తయ్యాయి. ప్రతి రోజూ నాకు మీ ఆదరాభిమానాలు, అపూర్వమైన మద్దతు లభించింది. మెరుగైన ఆంధ్రప్రదేశ్‌ కోసం మనమంతా ప్రతి రోజూ కలిసి నడిచాం.  ప్రజాసంకల్పయాత్రలో ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ రాజన్న రాజ్యం మళ్లీ తేవాలన్న నా దృఢ సంకల్పం మరింత బలపడుతోంది  అని జగన్‌  ట్వీట్‌ చేశారు.
ys jagan mohan reddy tweet
 
నేడు రేపు పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ విరామం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న పాద‌యాత్ర శ‌నివారం ప్రారంభం కానుంది. ఏపీకి ప్ర‌త్యేక హూదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద వైసీపీ ధ‌ర్నాల‌కు పిలుపునిచ్చింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.