వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 18:41:26

వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

పార్ల‌మెంట్‌లో వైసీపీ ఎంపీలు రాజీనామా స‌మ‌ర్పించిన త‌ర్వాత పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి స‌వాల్ విసిరారు.... ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ ఏ రోజు కూడా వెన‌క‌డుగు వేయ‌లేద‌ని పోరాటం చేస్తామ‌ని చెప్ప‌డ‌మే కాకుండా చేసి నిరూపించామ‌ని అన్నారు.  దీని పై వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారని. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలతో కలసి నడవాలనే ఉద్దేశం ఉంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలంటూ చంద్రబాబుకు సవాల్‌ విసిరారు.
 
మేం చెప్పిందే చేశాం. మా ఎంపీలు రాజీనామా లేఖలు సమర్పించారు. చంద్రబాబుకు నేను సవాల్‌ విసురుతున్నా. మీ ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించండి. ఏపీ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా సాధన కోసం అందరం ఐక్యమత్యంగా నిలబడదామ’ని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో ఎంపీల ఆమరణ దీక్షకు తోడు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తామని, హోదా పోరాటంలో ప్రజలకు సంఘీభావంగా వైఎస్సార్‌సీపీ నిలబడుతుందని మరో ట్వీట్‌లో జగన్‌ తెలిపారు.
 
ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదా పోరాటం, పార్లమెంట్‌ నిరవధిక వాయిదా, వైఎస్సార్‌ సీపీ ఎంపీల రాజీనామా  విష‌యాల పై మాట్లాడవ‌చ్చ‌ని స‌మాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.