జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan tweet on special status
Updated:  2018-04-02 01:24:34

జ‌గ‌న్ ట్వీట్

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హూదా పోరుపై తాజాగా ట్వీట్ సంధించారు...యువత ఉద్యోగ ఆకాంక్షలకు ప్రతీక ప్రత్యేక హోదా అని తెలియ‌చేశారు జ‌గ‌న్.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఆందోళనలు ఉధృతం చేస్తారని వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ తెలియ‌చేశారు.
 
ప్ర‌త్యేక హోదా కోసం విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌ల్లో ఆందోళనలు నిర్వహిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాస్థాయిల్లో నిరాహార దీక్షలు చేపడతారని ఆయన ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 
 
ప్రత్యేక హోదా మా హక్కు హోదా ఇవ్వకపోతే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేసి.. ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు అని తెలియ‌చేశారు. ఏపీ ప్రయోజనాలు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబునాయుడు కూడా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది అని వైఎస్‌ జగన్‌ ట్విట్ట‌ర్‌లో తెలిపారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.