జ‌గ‌న్ ఆవేద‌న‌తో ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan ys
Updated:  2018-09-24 10:43:11

జ‌గ‌న్ ఆవేద‌న‌తో ట్వీట్

తెలుగుదేశం పార్టీకి చెందిన అర‌కు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ‌ల హ‌త్య‌ల‌పై   ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఈ మేరకు ఆయ‌న ట్వీట్ కూడా చేశారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను మావోయిస్టులు కాల్చిచంప‌డం దారుణం అని ఆయ‌న ఆవేద‌న చెందారు. ప్ర‌జాస్వామ్యంలో హింస‌కు, హ‌త్య‌కు తావులేద‌న్నారు. నా ఆలోచనలు మరియు ప్రార్ధనలు కిడారి, సివేరి కుటుంబ స‌భ్య‌లుకు ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నాన‌ని అన్నారు.
 
ఇక మ‌రోవైపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రకు ప్ర‌జ‌లు అడుగ‌డుగున ప్ర‌జ‌లు బ్రహ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ పాద‌యాత్ర‌లో జగ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ 2019లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌రత్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.