జ‌గ‌న్- లోకేశ్ ల‌మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-23 14:50:00

జ‌గ‌న్- లోకేశ్ ల‌మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్

ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేశ్, ప్ర‌తిక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ఒకరినొక‌రు ప్ర‌శ్నించుకున్నారు.  
 
అందులో మొద‌టిగా జ‌గ‌న్ ట్వీట్ చేస్తూ చంద్రబాబు గారూ @ncbn .. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక పోరాటం కాని, ఒక ఉద్యమం కాని ఎప్పుడైనా చేశారా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
ఇక జ‌గ‌న్ వేసిన ప్ర‌శ్న‌కు మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీలో ప్రజల కోసం చాలా ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలు, నిరసనలు మీ నాన్న అవినీతి.. మీ క్విడ్ ప్రో కో, హత్యలు, కిడ్నాప్, భూ దోపిడికి వ్యతిరేకంగానే చేశారు. జైలు, హత్యలు ఇవన్నీ నువ్వు గుర్తించుకో..!" అని లోకేష్ ట్వీటారు. 
 
In 40yrs of his political journey, @ncbn has led many a movement for people, but the most noteworthy of them all were against your father's corruption fuelled by your greed, quid-pro-quo deals, murders, extortions, kidnappings, land grabbing, prison killings... remember now?
 
ఇక లోకేశ్ పెట్టిన ట్వీట్ ను చూసి నెటీజ‌న్లు ఆగ్ర‌హంతో ఆయ‌కు రీ ట్వీట్ చేస్తున్నారు. లోకేశ్ ట్వీట్ చేసిన విష‌యాల‌న్నింటిపై ద‌మ్ముంటే చ‌ర్చ‌పెట్టాల‌ని వైసీపీ అభిమానుల‌మైన మేము ఎక్క‌డికైనా హాజ‌రు అవుతామ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
ప్ర‌త్యేక హోదాకోసం ప్ర‌తిప‌క్ష వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్ర‌మే పోరాడుతున్నార‌ని గుర్తు చేశారు. ఇక మ‌రికొంద‌రు అయితే అయ్యా లోకేశ్ బాబు వాస్త‌వాల‌ను గ‌మ‌నించి ట్వీట్ చెయ్యాల‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.