వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-13 15:51:37

వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్

ఏపీకి ప్ర‌త్యేక హూదా సంజీవ‌నే అని  చెప్పాలి.. దీని కోసం ఇప్ప‌టికే ఉద్య‌మం ఉవ్వెత్తున  కొన‌సాగుతోంది.. దీని కోసం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నాయ‌కులు పార్టీల అధినేత‌లు  ఎన్నిసార్లు క‌లిసినా హూదా అవ‌స‌రం ఎంత అని చెప్పినా ఏపీకి ప్ర‌త్యేక హూదా అంశంలో ప్ర‌ధాని ఎటువంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం లేద‌నేది తెలిసిందే.. ఇక ఈ స‌మ‌యంలో వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి  ట్వీట్‌ చేశారు
 
!! జ‌గ‌న్ ట్వీట్ !!
ప్రధానిగారు, మీరు ఒక రోజు ఉపవాస దీక్ష చేశారు. కానీ మా ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులు దీక్ష చేసి.. ఆస్పత్రి పాలయ్యారు. ప్రత్యేక హోదా కావాలంటూ హస్తిన వేదికగా ఉద్యమించారు. ఇప్పటికైనా హోదా కావాలన్న ఐదు కోట్ల ఆంధ్రుల మాట వినండి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హోదా హామీని నిలబెట్టుకోండి  అని వైఎస్‌ జగన్‌  ట్విటర్‌లో విజ్ఞప్తి చేశారు.
 
ఇక ప్ర‌త్యేక హూదా కోసం ఇప్ప‌టికే వైసీపీ ఎంపీలు ఐదుగురు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేశారు... ఆర‌వ‌రోజు వారి ఆరోగ్యం క్షీణించ‌డంతో యువ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి నిరాహార దీక్షను పోలీసులు భ‌గ్నం చేసి వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.