తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

jagan
Updated:  2018-09-12 01:03:10

తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

ప్ర‌తిపక్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లకు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపారు. వినాయ‌క చ‌వితి పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికి విఘ్న‌లు తొలిగి మంచి విజ‌యాల‌ను సాధించాల‌ని ఆ దేవున్ని మ‌న‌సారా కోరుకుంటున్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు జ‌గ‌న్ పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు.
 
కాగా ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కంచుకోట విశాఖ ప‌ట్నంలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వ‌చ్చే ఎన్నిక్ల‌లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే నవ‌ర‌త్నాలను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.
 

షేర్ :