జ‌గ‌న్ అభినంద‌న‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan mohan reddy
Updated:  2018-04-28 02:43:17

జ‌గ‌న్ అభినంద‌న‌లు

ఏపీ ప్ర‌తిపక్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అఖిల భారత సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్, శీలం సాయితేజ,నారపురెడ్డి శౌర్య, మాధురి, వివేక్ జాన్సన్, కృష్ణకాంత్‌ పటేల్‌, వై అక్షయ్ కుమార్, భార్గవ శేఖర్ ల‌కు అభినంద‌న‌లు తెలిపారు...
 
ఈ సంద‌ర్భంగా మీడియాతో జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఇరు  తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు సివిల్స్ లో త‌మ ప్ర‌తిభ‌ను చాటార‌ని... వారంద‌రికి పేరు పేరున అభినంద‌న‌లు తెలియ‌జేసారు.. వారి కృషికి త‌గిన ఫ‌లితం ద‌క్కింద‌ని అన్నారు....శుక్రవారం సివిల్స్‌- 2017 ఫైనల్‌ ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే.
 
2017 సంవత్సరం జూన్ లో ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించారు...అందులో ఉత్తీర్ణులైన వారికి యూపీఎస్సీ అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 వరకు సివిల్స్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించారు. యూపీఎస్సీ మూడు స్టేజిల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తోంది... ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్‌, మూడు ఇంటర్వ్యూ... మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది.
 
టాప‌ర్స్ గా నిలిచిన విద్యార్ధుల ర్యాంక్స్ 
 
దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్‌పల్లి)    1  
శీలం సాయితేజ                                     43
నారపురెడ్డి శౌర్య                                     100
మాధురి                                                 144
వివేక్ జాన్సన్                                        195
కృష్ణకాంత్‌ పటేల్‌                                  607
వై అక్షయ్ కుమార్                                 624
భార్గవ శేఖర్                                           816  
 
మ‌రోవైపు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం సైకిల్ పార్టీ కంచుకోట అయిన కృష్ణా జిల్లా పెనమలూరు సెగ్మెంట్ లో నిర్విరామంగా కొన‌సాగుతోంది... ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ, తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.