వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 16:21:15

వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సోదర, సోదరీమణుల‌కు రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా  శుభాకాంక్ష‌లు తెలిపారు. ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసంను ఘ‌నంగా ముస్లిం సోద‌రులు జ‌రుపుకుంటార‌ని ఆయ‌న అన్నారు.
 
రంజాన్ మాసం ప్రారంభ‌మైన రోజు నుంచి ముస్లిం సోద‌రులు సుమారు నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం చేస్తార‌ని జ‌గ‌న్ తెలిపారు. రంజాన్ పండుగ అంటే కేవ‌లం ఉప‌వాస దీక్ష‌లు కాద‌ని, మ‌నిషిలో ఉండే చెడు భావాల‌ను రూపుమాపే గొప్ప‌పండుగ అని జ‌గ‌న్ తెలిపారు.
 
ఏడాదికి ఒక్క‌ సారి వ‌చ్చే ఈ రంజాన్ పండుగ‌ను ముస్లిం సోద‌రులు ఎంతో ఘ‌నంగా జ‌రుపుకుంటార‌ని, మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు.
 
ఇక ఆయ‌న త‌లపెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర నేటితో 164వ రోజుకు చేరుకుంది. అయితే ప్ర‌స్తుతం ఈ సంక‌ల్పయాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమల మండ‌లంలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ఒక్కొక్క‌టి ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి పాల‌న‌ను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ప్ర‌జా సంక‌ల్ప‌పాద‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.