డీజీపీకి లేఖ‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-26 18:36:51

డీజీపీకి లేఖ‌

ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో నిర్విర‌మంగా కొన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూ తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తు ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. 
 
ఇక ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా ఏపీ డీజీపీ కార్యాల‌యానికి మ‌రోసారి ఆవేద‌న‌తో లేఖ రాశారు జ‌గ‌న్. ఈ సంద‌ర్భంగా లేఖ‌లో జ‌గ‌న్ పేర్కొంటూ ప్రభుత్వం తనకు ఏర్పాటు చేసిన వాహనం అసంతృప్తిగా ఉంద‌ని అన్నారు. ప్ర‌భుత్వం త‌న‌కు డొక్కు వాహ‌నం ఇచ్చింద‌ని, ఈ వాహ‌నాన్ని శ్రీకాకుళంలో అధికారులు వాడి త‌న‌కు కేటాయించార‌ని అది త‌ర‌చూ మొరాయిస్తూ త‌న‌ను ఇబ్బందికి గురి చేస్తుంద‌ని జ‌గ‌న్ లేఖ‌లో పేర్కొన్నారు.
 
అయితే తాను గ‌తంలో కూడా మూడు సార్లు డీజీపీ కార్యాలాయానికి లేఖ రాశాన‌ని అయినా కానీ వారి నుంచి ఎలాంటి స‌మాధానం రాలేద‌ని, అయితే ఇప్పటికైనా తన వాహనాన్ని మార్చి, కొత్త బుల్లెట్ ప్రూఫ్‌ను ఇవ్వాలని ఆయన కోరారు. తాను పాద‌యాత్ర చేస్తున్న స‌మయంలో  రెండు సార్లు ఆగిపోయిందని ఇటీవల హైదరాబాద్‌కు వెళ్తుండగా మరోసారి ఆగిపోయిందని పేర్కొన్నారు. దీంతో విసుగు చెందిన జగన్ తనకు మరో కొత్త వాహనం కావాలని కోరుతూ డీజీపీ కార్యాల‌యానికి లేఖ రాశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.