స‌ర్వేప‌ల్లిలో జ‌గ‌న్ స్పీచ్ కేక

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-31 06:04:58

స‌ర్వేప‌ల్లిలో జ‌గ‌న్ స్పీచ్ కేక

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోక‌వ‌ర్గానికి చేరుకుంది. స‌ర్వేపల్లి నియోజ‌క‌వ‌ర్గం పాద‌ల‌కూరులో  ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో  ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం ఇచ్చారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చంద్ర‌గ్రహ‌నం ప‌ట్టింద‌ని వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రంలో ఇవాళ ప‌రిపాల‌న  ఎలా ఉందంటే.... మొద‌టి సారి అనుకుంటా.... రిప‌బ్లిక్ డేజ‌రుపుకుంటా ఉంటే రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌న‌కు క‌నిపించ‌ర‌ని జ‌గ‌న్ అన్నారు.

నాలుగు సంవ‌త్స‌రాల ప‌రిపాల‌న ఎలా ఉందంటే.... సాక్షాత్తు మ‌న ముఖ్య‌మంత్రి అక్ర‌మ నివాసంలో ఉంటారు. ఆ అక్ర‌మ నివాసంలోనే ముఖ్య‌మంత్రి గారి భార్య రిప‌బ్లిక్ డే నాడు జెండా వంద‌నం చేస్తారు.... ముఖ్య‌మంత్రి విదేశాల‌కు వెళ్తారు..... త‌న బావ మ‌రిది బాల‌కృష్ణ సీఎం సీటులో కూర్చుంటారు. అర్చ‌కులు, పూజారులు మామూలుగా  దుర్గ‌మ్మ గుడిలో పూజ‌లు చేస్తారు.... కాని ఇవాళ తాంత్రికులు, మాంత్రికులు  దుర్గ‌మ్మ గుడిలో పూజ‌లు చేస్తున్నారు... నాలుగు సంవ‌త్స‌రాల పాల‌న‌లో  ఏపీకి చంద్ర‌గ్ర‌హ‌ణం ఏ స్ధాయిలో ప‌ట్టిందో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని  జ‌గ‌న్ పంచ్ డైలాగ్ లు విసిరారు.

ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను నిస్సిగ్గుగా ఒక్క‌రికి కోట్లు ఖ‌ర్చు చేసి కొనుగోలు చేస్తున్నారు. వారి చేత రాజీనామా చేయించరు...వారిని అన‌ర్హులుగా ప్ర‌కటించరు... సిగ్గులేకుండా మంత్రి ప‌ద‌వులు కూడా ఇస్తారు.... రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు ద‌గ్గ‌రుండి తూట్లు పొడుస్తున్నారు.

రాష్ట్ర‌ప‌తి మ‌న రాష్ట్రానికి వ‌స్తారు.. రాష్ట్రప‌తి ఫ్యామిలిని  లైసెన్సు లేకుండా  ఉన్న అక్ర‌మ  బోర్డులో తిప్పుతారు...... ఇలా నాలుగు సంవ‌త్స‌రాలుగా రాష్ట్రానికి చంద్ర‌గ్ర‌ణం ప‌ట్టింద‌ని జ‌గ‌న్ ఎద్దేవా  చేశారు. ఇవాళ ప‌ట్టిన చంద్ర‌గ్ర‌హణం పోతుంది కాని, మ‌న రాష్ట్రానికి ప‌ట్టిన చంద్ర‌గ్ర‌హ‌ణం వ‌దిలే రోజు  ఎప్పుడు వ‌స్తుందో అని అన్నారు.   బుధ‌వారం చంద్ర‌గ్ర‌హ‌ణం కావ‌డంతో జ‌గ‌న్ స్పీచ్ అక్క‌డ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంది. చంద్ర‌గ్ర‌హ‌ణం పేరుతో రాష్ట్రంలో నెల‌కొన్ని స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌య్యేలా వివ‌రించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.