జ‌గ‌న్ కు మ‌రో తొమ్మిది రోజులు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-05 17:29:05

జ‌గ‌న్ కు మ‌రో తొమ్మిది రోజులు ?

వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర కృష్ణాజిల్లాలో కొన‌సాగుతోంది... ఇటు వైసీపీ త‌ర‌పున నాయ‌కులు పెద్ద ఎత్తున జ‌గ‌న్ వెంట న‌డుస్తున్నారు... అలాగే వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ఈ నెల 14 న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోకి అడుగుపెట్ట‌నుంది..ఈ జిల్లాలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌తో గోదావ‌రి జిల్లాలో వైసీపీ మరింత పుంజుకుంటుంది అని అంటున్నారు నాయ‌కులు.
 
ఇటీవ‌ల పెదఅమిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా పరిశీలకుడు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని, నర్సాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నర్సింహరాజు తదితరులు నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి క‌న్వీన‌ర్ల‌తో చ‌ర్చించి పాద‌యాత్ర‌రూట్ మ్యాప్ సిద్దం చేశారు.
 
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సరిగ్గా 15 ఏళ్ళ క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన పాదయాత్రలో భాగంగా మే నెల 14వ తేదీనే జిల్లాలో ప్రవేశించారని సరిగ్గా అదేరోజున జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర కూడా జిల్లాలో ప్రవేశించడం చారిత్రక ఘట్టమని వైసీపీ నాయ‌కులు అంటున్నారు.
 
ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని 15 నియోజకవర్గాలో సుమారు 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుందని వైసీపీ తెలియ‌చేస్తోంది. 12 నియోజకవర్గాల్లో పబ్లిక్‌ మీటింగ్స్‌ జరుగుతాయని తెలియ‌చేశారు నాయ‌కులు.
 
ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు ఆళ్ళ నాని, ముదునూరి ప్రసాదరాజు, కొయ్యే మోషేన్‌రాజు, ఏలూరు పార్లమెంట్‌ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్, నియోజకవర్గాల కన్వీనర్లు 
 
పీవీఎల్‌ నర్సింహరాజు (ఉండి), 
మధ్యాహ్నపు ఈశ్వరి (ఏలూరు),
గ్రంధి శ్రీనివాస్‌ (భీమవరం), 
కవురు శ్రీనివాస్‌ (ఆచంట),
కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం),
కారుమూరి నాగేశ్వరరావు (తణుకు), 
తెల్లం బాలరాజు (పోలవరం), 
తలారి వెంకట్రావు (గోపాలపురం), 
తానేటి వనిత (కొవ్వూరు),
కొఠారు అబ్బయ్య చౌదరి (దెందు లూరు)
గుణ్ణం నాగ‌బాబు (పాల‌కొల్లు)
ముదునూరి ప్రసాదరాజు (న‌ర‌సాపురం) 
 
జిల్లా యూత్‌ అధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్‌(బాబు), పార్టీ రాష్ట్ర రాజకీయ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఇందుకూరి రామకృష్ణంరాజు, మాజీ శాసనపభ్యులు గంటా మురళి, త‌దిత‌రులు జిల్లాలో జ‌గ‌న్ పాదయాత్ర‌లో జ‌గ‌న్ తో కలిసి ముందుకు న‌డువ‌నున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.